RRR: హైదరాబాద్ కు చరణ్, ఎన్టీఆర్.. సంబరాల్లో రాజమౌళి అండ్ టీం, త్వరలో ప్రెస్ మీట్ ?

pratap reddy   | Asianet News
Published : Aug 19, 2021, 12:56 PM IST
RRR: హైదరాబాద్ కు చరణ్, ఎన్టీఆర్.. సంబరాల్లో రాజమౌళి అండ్ టీం, త్వరలో ప్రెస్ మీట్ ?

సారాంశం

యావత్ దేశం సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏకైక చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలితో రాజమౌళి సత్తా రుచి చూసిన దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు.

యావత్ దేశం సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏకైక చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలితో రాజమౌళి సత్తా రుచి చూసిన దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి లేకుంటే త్వరగానే ఆర్ఆర్ఆర్ సందడి మొదలయ్యేది. 

భారీ చిత్రం కావడం, పైగా కరోనా అడ్డు తగలడంతో ఆర్ఆర్ఆర్ ఆలస్యమైంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జక్కన్న ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇటీవల ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. భారీ సాంగ్ షూట్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు ఆర్ఆర్ఆర్ టీం ఉక్రెయిన్ వెళ్ళింది. 

ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు అయింది. దీనితో చరణ్, ఎన్టీఆర్ రీసెంట్ గా హైదరాబాద్ చేరుకున్నారు. జక్కన్న అండ్ టీం సంబరాల్లో మునిగిపోయారు. షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. 

ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సినిమా విశేషాలు, రిలీజ్ డేట్ పై క్లారిటీ ఈ ప్రెస్ మీట్ లో ఇవ్వనున్నట్లు టాక్. 

రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ దోస్తీకి అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా