అతను ఎవరో తెలియదు, నాకు ఫ్రీ పబ్లిసిటీ.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై దాసరి అరుణ్

By telugu teamFirst Published Aug 19, 2021, 10:05 AM IST
Highlights

లెజెండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆయన కుటుంబంలో ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తూనే ఉంది. దాసరి తనయులపై తరచుగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి.

లెజెండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆయన కుటుంబంలో ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తూనే ఉంది. దాసరి తనయులపై తరచుగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి.  రెండు రోజుల క్రితమే దాసరి తనయుడు అరుణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నర్సింహులు వెంకటేష్ అనే వ్యక్తి దాసరి అరుణ్ పై ఈ కేసు నమోదు చేశాడు. తనని కులం పేరుతో దాసరి అరుణ్ దూషించాడని నర్సింహులు వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఐపీసీ 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 

నర్సింహులు వెంకటేష్ దాసరి వద్ద 2012 నుంచి 2016 వరకు మూవీ రిస్టోరేషన్ అవుట్ సోర్సింగ్ పనులు చూసుకునేవాడు. దాసరి మరణం తర్వాత ఆయన కుమారులు ప్రభు, అరుణ్.. వెంకటేష్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన డబ్బు అడిగేందుకు ఇటీవల వెంకటేష్ దాసరి అరుణ్ వద్దకు వెళ్ళాడు. 

కానీ అరుణ్ డబ్బు ఇచ్చేందుకు అంగీకరించకపోగా.. ఒప్పందంపై తాను సంతకం చేయలేదని చెప్పాడట. పైగా తనని కులం పేరుతో దూషించాడని, బెదిరింపులకు దిగాడని వెంకటేష్ పోలీసులని ఆశ్రయించారు. 

ఈ కేసుపై దాసరి అరుణ్ తాజాగా స్పందించాడు. ఈ విషయం గురించి ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు నాకు ఫోన్ చేశారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఇదే విషయాన్ని పోలీసులకు నేను చెప్పాను. నాపై కేసు నమోదైంది అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగైతే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ ఉంటుంది కదా అని దాసరి అరుణ్ అన్నారు. 

పైగా అతను మా నాన్నగారి వద్ద పనిచేశానని చెబుతున్నాడు. నేనెప్పుడూ నాన్నగారి వద్ద ప్రొడక్షన్ పనులు చూసుకోలేదు. అలాంటప్పుడు అతనితో నాకు పరిచయం ఎలా ఉంటుంది. తెలియని వ్యక్తిని నేను డబ్బు ఎలా ఇవ్వాలి. ఇందంతా నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేలా ఉంది అని అరుణ్ హాస్యాస్పదంగా చెప్పారు.  

click me!