షాకింగ్ :వైఎస్‌ వివేకానంద రెడ్డి బయోపిక్‌ 'వివేకం’టీజర్

Published : Mar 17, 2024, 07:25 PM IST
షాకింగ్ :వైఎస్‌ వివేకానంద రెడ్డి బయోపిక్‌ 'వివేకం’టీజర్

సారాంశం

 2019లో వివేకానందరెడ్డి హత్యకు గురికాగా.. ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. అన్నది ఎవ్వరికీ తెలియ‌కుండా ఉన్నారు. హత్యపై   ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి..? 


ఇది ఎలక్షన్స్ టైమ్. ఎక్కడెక్కడి ఎలక్షన్ టార్గెట్ సినిమాలు జనాలు ముందుకు రావటానికి రంగం సిద్దమవుతోంది. కొన్ని జగన్ కు వ్యతిరేకంగా మరికొన్ని తెలుగుదేశం పార్టీ,జనసేనకు వ్యతిరేకంగా రెడీ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఈ వరసలో ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.  గత కొంత కాలంగా సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై ఈ సినిమా తీసినట్లు అర్దవుతోంది.  2019లో వివేకానందరెడ్డి హత్యకు గురికాగా.. ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. అన్నది ఎవ్వరికీ తెలియ‌కుండా ఉన్నారు. హత్యపై   ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి..? వంటి అంశాలు   సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాలను ప్రస్తావిస్తూ వివేకా బయోపిక్ గా వచ్చిన సినిమా టీజర్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

 

ముందు నుంచి వివేకాది సహజ మరణం అని.. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని  మీడియాలో వార్తలు వచ్చాయి.  అయితే ఇది నిజం కాదని అంటున్నారు.గత ఎన్నికల లాగే ఈసారి కూడా వివేకా హత్య కేసు చర్చనీయాంశం అవుతోంది. దాంతో  వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

 

సీబీఐ చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్య, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో  ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌లో చూపించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న www.vivekabiopic.comలో చూడొచ్చని ట్రైలర్‌లో పేర్కొన్నారు.   ఈ రోజు రిలీజైన వివేకా బయోపిక్ ‘వివేకం’ ట్రైలర్ చూస్తే.. టార్గెట్ జగన్ అనే అని అర్థమవుతుంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?