నాగార్జున అడగడంతో ఓకే అన్న టబు

Published : Nov 24, 2016, 03:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నాగార్జున అడగడంతో ఓకే అన్న టబు

సారాంశం

అఖిల్ తదుపరి చిత్రంలో బాలీవుడ్ నటి అఖిల్ మూవీలో మెస్మరైజ్ చేయనున్న టబు నాగార్జున అడగడంతో ఓకే అన్న టబు

అక్కినేని నాగార్జున, అమల తనయుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథను ఫైనల్ చేసిన ఈ యంగ్ హీరో, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రస్తుతం తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, జనవరి నుంచి కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లోనే హీరోయిన్‑గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్‑గా ఎదిగింది. తరువాత నాగ్ సినిమాల్లో హీరోయిన్‑గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‑టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‑కు రెడీ అవుతోంది. నాగార్జున స్వయంగా అడగటంతో టబు ఈ పాత్రకు అంగీకరించిందన్న ప్రచారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు