అహ్మాదాబాద్ వెళ్లిన మహేష్ బాబు

Published : Nov 24, 2016, 09:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అహ్మాదాబాద్ వెళ్లిన మహేష్ బాబు

సారాంశం

గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో మూవీ షూటింగ్ కోసం టూర్ అహ్మదాబాద్ లో కీలక సన్నివేశాల షూటింగ్ లో సూపర్ స్టార్  

మహేశ్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో  నటిస్తున్న సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను హైదరాబాద్ .. చెన్నైలలో భారీస్థాయిలో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్.. అహ్మదాబాద్ లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమై .. దాదాపు నెల రోజులపాటు కొనసాగనుంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు మహేష్ బాబు అహ్మదాబాద్ చేరుకున్నారు.

ఈ నెల 27వ తేదీ నుంచి మహేశ్ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. సినిమాలో కీలకంగా కనిపించే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరించనున్నారు. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించనున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకంతో మహేశ్ అభిమానులు వున్నారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు