Taapsee: 'శభాష్ మిథూ' కు అంత తక్కువ ఓపినింగ్స్, ఊహించం..

Published : Jul 17, 2022, 09:02 AM IST
Taapsee: 'శభాష్ మిథూ' కు అంత తక్కువ ఓపినింగ్స్, ఊహించం..

సారాంశం

మహిళా క్రికెట్ లో అత్యంత పాపులర్ గా నిలిచిన మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో తాప్సీ నటించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని వయాకమ్ 18 స్టూడియోస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌(Mithali Raj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శభాష్ మిథూ(Shabaash Mithu). శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాప్సీ(Taapsee) మిథాలీరాజ్ గా నటించింది. ట్రైలర్ తో  సినిమాపై అంచనాలు పెంచేయగా..మొన్న శుక్రవారం మూవీ ను నిర్మాతలు  విడుదల చేసారు.  అయితే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదనే చెప్పాలి. మినిమం ఓపినింగ్స్ కూడా ఈ సినిమా తెచ్చుకోలేకపోయింది. కేవలం నలభై లక్షలు మాత్రమే ఓపినింగ్ డే రోజు రావటంతో ఈ సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది.

ఇక  క్రికెటర్ గా తాప్సీ ఆ పాత్ర కోసం బాగా కష్టపడినప్పటికీ తను అంతగా మ్యాచ్ కాలేకపోయిందని రివ్యులూ వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికే  ఎంఎస్ ధోని, అజర్, సచిన్, జెర్సీ తదితర చిత్రాల్లో ఆడియన్స్ క్రికెట్ ని తెరమీద చూసేయటంతో ఈ సినిమాలోనూ అదే జరగటంతో రిపీట్ గా ఫీలయ్యారు. తైరపై క్రికెట్ ఆటను  రక్తికట్టించలేకపోయారు. అన్ని స్పోర్ట్ మూవీస్ లో లాగేనే ఇందులోనూ రొటీన్ ట్విస్ట్ లు ఉండటం నిరాశపరుస్తుంది. డైరక్ట్ ఓటిటిలో రిలీజ్ అయితే రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో అంటున్నారు. 

అయితే చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది..ఆమె  క్రికెటర్‌ అయ్యే క్రమంలో ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం మిథాలీ శ్రమించిన తీరును  కళ్లకు కట్టినట్లు చూపించారు. భరత మహిళ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టుని ప్రపంచ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్లి తనదైన ఇన్నింగ్స్ తో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం ఆమె క్రికెట్ లో ఎదుర్కొన్న సవాళ్లు.. ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న అవమానాలు ఇబ్బందుల సమాహారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 

అయితే  మనసుని హత్తుకునే సీన్స్ మరిన్ని ఉండాల్సింది అంటున్నారు అభిమానులు. ఇక మిథాలీగా తాప్సీ వంద శాతం సెట్ అయిందని చెప్పాలి.  కానీ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. మిథాలీగా తాప్సి హావభావాలు బాగున్నాయంటున్నారు.   ఇక శభాష్ మితు చిత్రం వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై  నిర్మితమైంది. జులై 15న ఈ చిత్రం విడుదల అయ్యింది.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?