Raviteja: నిర్వాహకుల అత్యుత్సాహం.. `రామారావు` ట్రైలర్‌ ఈవెంట్‌ లో ఫ్యాన్స్ రచ్చ..

Published : Jul 17, 2022, 08:46 AM IST
Raviteja: నిర్వాహకుల అత్యుత్సాహం.. `రామారావు` ట్రైలర్‌ ఈవెంట్‌ లో ఫ్యాన్స్ రచ్చ..

సారాంశం

 `రామారావుః ఆన్‌ డ్యూటీ` ట్రైలర్‌ ఈవెంట్‌ని రచ్చ రచ్చగా మార్చింది. Raviteja ఫ్యాన్స్ భారీగా పోటెత్తడంతో అంతా గోలగోలగా మారింది. ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.

నిర్వహకులు ప్రదర్శించిన అత్యుత్సాహం మాస్‌ మహారాజా రవితేజ నటించిన `రామారావుః ఆన్‌ డ్యూటీ` ట్రైలర్‌ ఈవెంట్‌ని రచ్చ రచ్చగా మార్చింది. ఫ్యాన్స్ భారీగా పోటెత్తడంతో అంతా గోలగోలగా మారింది. ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. రవితేజ నటించిన రామారావుః ఆన్‌ డ్యూటీ` మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ని శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో నిర్వహించారు. అయితే ఈవెంట్‌కి సంబంధించిన సమాచారం ఈవెంట్‌ మేనేజింగ్‌ సంస్థ రెండు రోజుల ముందునుంచే సోషల్‌ మీడియాలో పెట్టింది. టైమ్‌, ప్లేస్‌తో సహా నెటిజన్లతో పంచుకున్నారు.అంతేకాదు పాస్‌లు కూడా జారీ చేశారట.

దీంతో తీరా ఈవెంట్‌ టైమ్‌కి సదరు హోటల్‌కి భారీగా రవితేజ అభిమానులు తరలి వచ్చారు. ఈవెంట్‌ హాల్‌ చిన్నది. కానీ అభిమానులు వందల్లో వచ్చారు. దీంతో హోటల్‌ సెక్యూరిటీ అభిమానులను లోపలికి అనుమతించలేదు. అభిమానులు ఎంత బ్రతిమాలుకున్నా నిర్వహకులు కొంత మందినే అనుమతించగా, చాలా మంది బయటే ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్‌ దాడికి దిగారు. హోటల్‌ అద్దాలు ద్వంసం చేసినట్టు తెలుస్తుంది. భారీగా ఫ్యాన్స్‌ రావడంతో వారిని కంట్రోల్‌ చేయడం నిర్వహకులకు సాధ్యం కాలేదు. 

దీంతో పోలీసులను రంగంలోకి దించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అభిమానులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రవితేజ అభిమానులకు, పోలీసులకు, బాడీగార్డ్ కి మధ్య గట్టిగానే ఘర్షణ నెలకొంది. మరోవైపు ఈవెంట్‌లోనూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. అరుపులు, గోలలతో హోరెత్తించారు. అభిమానంతో అరవడం వేరు. తమ ఫ్రస్టేషన్‌తో అరవడం వేరు. ఇక్కడ రెండోది ఇంప్లిమెంట్‌ చేశారు. ఈవెంట్‌ మొత్తం గందరగోళంగా మారిపోయింది. దీంతో ఇక లాభం లేదని రవితేజతో సహ అంతా మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోయారు. 

ఆ తర్వాత కూడా హోటల్‌ నుంచి అభిమానులను బయటకు పంపించేందుకు నిర్వహకులు, చిత్ర బృందానికి చెందిన బాడీ గార్డ్ కి చుక్కలు కనిపించాయి. కొంత మంది అభిమానులపై బాడీ గార్డ్స్ దాడి చేయడం గమనార్హం. దీంతో అభిమానులు రెచ్చిపోయారు. గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. తమకు పాస్ లు జారీ చేశారని, అందుకే వచ్చామని, మరి పాస్‌లు ఎందుకివ్వాలి, ఇలా ఎందుకు అవమానించాలి, తమపై ఎందుకు దాడి చేయాలని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. 

ఈవెంట్‌ నిర్వహకులు.. తమ మనుగడని చాటేందుకు, నిర్మాతలు, హీరో మెప్పుపొందేందుకు ఇలా ముందస్తుగానే అభిమానులకు సమాచారం అందించారని తెలుస్తుంది. పాస్‌లు కూడా జారీ చేశారట. నిజానికి మీడియాతో జరిగే చిన్న చిన్న ఈవెంట్లకి అభిమానులకు అనుమతి ఉండదు. వారిని ఆహ్వానించడం కూడా చాలా అరుదు. కానీ నిర్వహకులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా రవితేజ ఫ్యాన్స్ తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వర్షంలో ఎక్కడి ఎక్కడి నుంచో అభిమానులు వచ్చారు. తీరా వారికి ఈ స్థాయిలో అవమానం జరగడం అది నిజంగా రవితేజకి చెడ్డ పేరుని తీసుకురావడమే అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో, అటు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా