నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్ కారణం ఏంటంటే..?

By Mahesh Jujjuri  |  First Published Aug 27, 2024, 4:58 PM IST

బోల్డ్ కామెంట్స్ చేయడంలో కంగనాతో పాటు.. తాప్సీ కూడా ముందుంటుంది బాలీవుడ్ లో. ఇక తాప్సీ ఎప్పుడు ఏం చేస్తుందో.. ఏమాట్లాడుతుందో తెలియదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లిస్ట్ లో పేరు సంపాదించుకున్న తాప్సీ..తాజాగా మరో సారి హాట్ టాపిక్ అయ్యింది.
 


బోల్డ్ కామెంట్స్ చేయడంలో కంగనాతో పాటు.. తాప్సీ కూడా ముందుంటుంది బాలీవుడ్ లో. ఇక తాప్సీ ఎప్పుడు ఏం చేస్తుందో.. ఏమాట్లాడుతుందో తెలియదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లిస్ట్ లో పేరు సంపాదించుకున్న తాప్సీ..తాజాగా మరో సారి హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ గా మారింది తాప్సీపన్ను. కాని ఇక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.. వచ్చనవి కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో తాప్సీ టాలీవుడ్ కు బై బై చెప్పేసి.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. ఇక అక్కడ రెగ్యూలర్ క్యారెక్టర్లు కాకుండా.. కాస్త డిఫరెంట్ గా కథలు సెలక్ట్ చేసుకుంటూ.. పాపులర్ నటిగా మారింది. అయితే తాప్సీ బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాక టాలీవుడ్ వైపు చూడలేదు. అంతే కాదు టాలీవుడ్ ను విమర్షించింది కూడా. 

Latest Videos

 బాలీవుడ్ లో తాప్సీ.. బేబీ, పింక్, ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ లాంటి సినమాలతో స్సెషల్ ఇమేజ్ ను సంపాదించింది. ఇండియన్ సినిమాలో  తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. హిందీలో విమెన్  సెంట్రిక్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిందితాప్సీ. ఇక హిందీలో మిషన్ మంగళ్, చాంత్‌కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ గా తెరకెక్కిన శభాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇక ఈ హీరోయిన్ ఎప్పుడు ఏ బాంబ్ పేల్చుతుందో తెలియదు. ఆమె చేసే కాంట్రవర్సీ కామెంట్స్  ఇండస్ట్రీలోహాట్ టాపిక్స్అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తాప్సీ.. నెటిజన్లకు కూడా అంతే ఘాటుగా సమాధానం చెపుతుంటుంది. ఇక తాజాగా ఈమె మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.  నేను నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు అంటే ఘాటుగా మాట్లాడించి.. తాప్సీ  బోల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

తాప్సీ ఇటీవల ‘పాపరాజీ’ గురించి మాట్లాడింది. ‘నేను ప్రముఖ నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. ‘నో అంటే నో’ అని చెబితే తెరవెనుక ఉన్న మహిళలు అంగీకరించరు. నేను మొదట అమ్మాయిని. ఆ తర్వాత నటిని. నేను ఇలా అంటున్నానుని కొందరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్ గా చేస్తున్నావ్ అని కామెంట్స్ చెయ్యొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి’ అని తెలిపింది తాప్సీ.

click me!