యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండనుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గత కొద్ది రోజులుగా మహేష్ అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న అంశం ఆయన ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి వాయిస్ ఇవ్వబోతున్నారని. అయితే ఎంతవరకూ నిజం ఉందనేది చాలా మంది అర్దం కాలేదు. కొందరు అద్బుతం అంటే మరికొందరు అందులో నిజం లేదు అని తేల్చేసారు. అయితే మహేష్ మాత్రం తను పని తాను చేసుకుపోయారు. ఆయన ‘ముఫాసా: ది లయన్ కింగ్’చిత్రానికి వాయిస్ ఇచ్చారు. అయితే ఇందులో ప్రత్యేకతం ఏముంది.
1994లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ లయన్ కింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ రాబోతుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండనుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మన దేశంలో కూడా హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే హిందీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ తో విడుదలైంది. అలాగే టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది ఈ చిత్రంలో ముఖ్య పాత్రదారులుగా కనిపించబోతున్నాయి. లయిన్ కింగ్ లోనూ ఈ రెండు పాత్రలూ ఫన్ అందించాయి. ఆ పాత్రలకు అప్పట్లో బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు మరోసారి ఈ ముఫాసా తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మ బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు ఆలీ తమ వాయిస్ ఇచ్చారు. తెలుగు వెర్షన్లో వీరు చెప్పే డైలాగులు అద్భుతంగా ఉంటూ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని టాక్.
ఇందు నిమిత్తం మహేష్ బాబు కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ . ముఫాసాకి మహేష్ గొంతు ఇవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల వరకు బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతుందని అంచనా. గుంటూరు కారం తర్వాత అభిమానులకు మహేష్ ఇంకో రెండు మూడేళ్ళ దాకా తెరపై కనపడరు. అప్పటిదాకా పాత సినిమాల రీ రిలీజులతో కాలక్షేపం చేయాలి. ముఫాసాలో గర్జిస్తున్న సింహానికి మహేష్ గొంతు వింటే అదో కొత్త అనుభూతి దక్కుతుందని భావిస్తున్నారు
ఇక హిందీలో ముఫాసా పాత్రకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఆయా బాషల్లో స్టార్ హీరోలు ముఫాసా పాత్రకు వాయిస్ ఇస్తున్నారు. కాగా.. తెలుగు ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది. . హిందీ, కన్నడ, మలయాళం, తమిళం తదితర భాషల్లోనూ అగ్ర హీరోలే ముఫాసాకు అండగా నిలవబోతున్నారు.