బ్యాడ్ లక్ కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు.. హీరోయిన్ కామెంట్స్!

Published : Aug 28, 2018, 11:57 AM ISTUpdated : Sep 09, 2018, 01:06 PM IST
బ్యాడ్ లక్ కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ వివాదం మరింత రాజుకుంది. మీడియా ముందుకొస్తోన్న ప్రతి హీరోయిన్ కి ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ వివాదం మరింత రాజుకుంది. మీడియా ముందుకొస్తోన్న ప్రతి హీరోయిన్ కి ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు బోల్డ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని చెబుతున్నారు.

కానీ తాప్సి మాత్రం సరికొత్త రీతిలో స్పందించింది. కాస్టింగ్ కౌచ్ ఎదురుకాకపోవడం తన దురదృష్టమని చెబుతోంది. ''అదృష్టమో, దురదృష్టమో కానీ నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవు. దురదృష్టమని ఎందుకంటున్నానంటే.. నాకు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉంటే అప్పుడు ఈ విషయంపై చాలా బాగా మాట్లాడేదాన్ని. 'పింక్' సినిమా విడుదలైన తరువాత నేను మహిళా సమస్యలపై మాట్లాడతానని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాబట్టి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడితే బాగుండేది.

కానీ నాకు అది అనుభవం లేని విషయం. మొదటి నుండి కూడా నేను పెద్ద బ్యానర్లు, పెద్ద దర్శకులతో సినిమాలు చేశాను. అలానే కెరీర్ కంటిన్యుడూ అయింది. దీంతో నాతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఇది నాకు బాగా కలిసొచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ విషయంపై మాట్లాడే అవకాశం నాకు రాదేమో'' అంటూ స్పందించింది.

ఇటీవల తాప్సి నటించిన 'నీవెవరో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. తాప్సి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. 

ఇవి కూడా చదవండి.. 

అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది.. సీనియర్ నటి!

కాస్టింగ్ కౌచ్ లో తప్పులేదు.. నేను దాన్ని గౌరవిస్తాను: రష్మి సంచలన కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా