Taapsee Mishan Impossible:సూపర్ స్టార్ చేతుల మీదుగా.. తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ రిలీజ్.

Published : Mar 16, 2022, 09:21 AM ISTUpdated : Mar 16, 2022, 09:25 AM IST
Taapsee Mishan Impossible:సూపర్ స్టార్ చేతుల మీదుగా.. తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ రిలీజ్.

సారాంశం

టాలీవుడ్ లో ఆఫర్లు లేక బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ(Taapsee). బీ టౌన్ లో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్లలో తాప్సీ కూడా ఒకరు. ఇక చాలా కాలం తరువాత తెలుగులో ఆమె నటించిన మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

తెలుగు తెరపై ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ(Taapsee).. తెలుగులో వర్కౌట్ అవ్వక బాలీవుడ్ గుమ్మం తొక్కింది. అక్కడ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరో ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ.. మంచి సినిమాలతో..తన మార్క్ నటనతో బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుంటోంది. ఇక చాలా కాలం తరువాత తెలుగులో తెరపై మెరవబోతోంది.

బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన తాప్సీ(Taapsee) పన్ను..చాలా కాలం తర్వాత తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) సినిమాతో పలకరిస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక రీసెంట్ గా మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. గతంలో పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్  చేస్తున్నట్లు ప్రకటించారు. డిఫరెంట్ స్టోరీతో.. ఎంటర్టైన్మెంట్ బేస్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషిస్తుండగా మార్క్ కె. రాబిన్ ఈ మూవీకి మ్యూజిక్ చేశారు.  

 

ఇక రీసెంట్ గా మహేశ్ బాబు(Mahesh Babu)  చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు రఘుపతి రాఘవ రాజారామ్. వాళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువ. ఆర్ఆర్ఆర్  అని చెప్పుకుంటూ తిరిగే ఈ బ్యాచ్.. దావూద్ ఇబ్రాహీమ్ ను పట్టిస్తే 50 లక్షల బహుమానం అనే ప్రకటన టీవీలో చూసి ముగ్గురూ ఆ పనిపై బయల్దేరతారు. 

 

ఆ తరువాత ఏమయ్యింది అనేది కథ. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అందులోనూ.. స్వరూప్ చేసిన శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ను దృష్టిలో పెట్టుకుని సినీ ప్రియులు మిషన్ ఇంపాజిబుల్(Mishan Impossible)  పై నమ్మకంతో ఉన్నారు. మరి ఏప్రిల్ 1న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?