Pooja Hegde :పూజ హెగ్డే చేసింది, ఖచ్చితంగా మాకు హెల్ప్ అవుతుంది

Surya Prakash   | Asianet News
Published : Mar 16, 2022, 07:34 AM IST
Pooja Hegde :పూజ హెగ్డే  చేసింది, ఖచ్చితంగా మాకు హెల్ప్ అవుతుంది

సారాంశం

హీరో రాజ్ తరుణ్ కి ఇటీవల హిట్స్ లేవు. రీసెంట్ గా వచ్చిన అనుభవించు రాజా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో చాలా కాలం తర్వాత తన శైలికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ట్రెండీగా ఉన్నాడు ఈ చిత్రంలో. రాజ్ తరుణ్ సరసన వ‌ర్ష బొల్ల‌మ్మ నటించింది.

తన సినిమాకు పూజ హెగ్డే ఉపయోగపడుతుందని చెప్తున్నారు రాజ్ తరుణ్.  హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా  మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ... ఈ సినిమా మా రెండేళ్ళ జ‌ర్నీ. స్టాండప్ రాహుల్ అంటే అల‌రించే కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. స్టాండప్ అనేది తెలుగువారికి అంతగా పరిచయం లేనిదే.  కానీ లక్కీగా ఇటీవ‌లే పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో స్టాండప్ కమెడియన్ పాత్ర చేసింది. అది మా సినిమాకు హెల్ప్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. దానికి మించి కామెడీతోపాటు మంచి ఎమోష‌న్స్ కూడా మా సినిమాలో వుంటుంది. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వ‌ర్ష పాత్ర చాలా క్యూట్‌ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాన‌నేది ఇందులో ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశారు అన్నారు.

దర్శకుడు శాంటో మాట్లాడుతూ.... ఈ క‌థ రాసుకున్న‌ప్పుడే నా జీవితంలో జ‌రిగిన‌ సంఘ‌ట‌ల‌ను రాసుకున్నాను. నేను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వ‌ శాఖ‌లో ప‌నిచేయ‌లేదు. సినిమాలు కూడా పెద్ద‌గా చూడ‌ను. కానీ నా జీవ‌న‌పోరాట‌మే న‌న్ను ద‌ర్శ‌కుడిని చేసింది. సినిమావాళ్ళ‌కు కానీ, బాచిలర్స్‌కు కానీ హైద‌రాబాద్‌లో ఇల్లు దొర‌క‌డం క‌ష్టం. ఇవి కూడా హీరో పాత్రలో చెప్పించాను. నేను జీవితంలో నేర్చుకున్న‌ది ఇప్ప‌టి యూత్‌కు స్పూర్తిగా వుండేలా ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాను. మ‌న కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు వుంటాయి. వాటిని స్టాండ‌ప్ కామెడీతో ఎలా వినోదాత్మ‌కంగా చెప్పించ‌వ‌చ్చో ఇందులో చెప్పాను. నేను క‌థ చెప్పిన‌ప్పుడు ప్రతీ విషయంలోనూ డీటెయిల్‌గా వివరాలు నిర్మాతలకు ఇచ్చాను. కాస్ట్యూమ్స్, సంగీతం,  కలర్ వంటి అన్ని అంశాలు ఒక స్కెచ్ రూపంలో చూపించాను. అవ‌న్నీ చూశాక‌ నిర్మాతలకు నాపై పూర్తి నమ్మకం కలిగింది. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం చ‌క్క‌గా కుదిరాయి. నిర్మాత‌లు నేను అనుకున్న‌దానికంటే ఎక్కువ స‌హ‌క‌రించారు. ఈనెల 18న థియేట‌ర్‌లో సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ కి ఇటీవల హిట్స్ లేవు. రీసెంట్ గా వచ్చిన అనుభవించు రాజా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో చాలా కాలం తర్వాత తన శైలికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ట్రెండీగా ఉన్నాడు ఈ చిత్రంలో. రాజ్ తరుణ్ సరసన వ‌ర్ష బొల్ల‌మ్మ నటించింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా