Taapsee Mishan Impossible Release: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ డేట్ ఫిక్స్...

Published : Mar 01, 2022, 07:07 AM ISTUpdated : Mar 01, 2022, 07:12 AM IST
Taapsee Mishan Impossible Release: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ డేట్ ఫిక్స్...

సారాంశం

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ(Taapsee)..అక్కడ దూసుకుపోతోంది. తన మార్క్ సినిమాలతో హడావిడి చేస్తోంది. ఇక చాలా కాలం తరువాత తెలుగులో ఆమె నటించిన మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ(Taapsee)..అక్కడ దూసుకుపోతోంది. తన మార్క్ సినిమాలతో హడావిడి చేస్తోంది. ఇక చాలా కాలం తరువాత తెలుగులో ఆమె నటించిన మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది.

తెలుగు తెరపై ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ(Taapsee).. తెలుగులో వర్కౌట్ అవ్వక బాలీవుడ్ గుమ్మం తొక్కింది. అక్కడ అతి తక్కువ కాలంలోనే టాప్​ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ.. మంచి సినిమాలతో..తన మార్క్ నటనతో బాలీవుడ్ తో డిఫరెంట్ మూవీస్ చేస్తూ, తానేంటో నిరూపించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయిన తాప్సీ(Taapsee)..  చాలా కాలం తరువాత తెలుగులో తెరపై మెరవబోతోంది.

బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన తాప్సీ(Taapsee) పన్ను,చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా మిషన్​ ఇంపాజిబుల్ (Mishan Impossible). ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వరూప్​ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఇండస్ట్రీలో హాట్ టాపక్ అయ్యింది. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్​ పతాకంపై నిరంజన్​ రెడ్డి, అన్వేష్​ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

ఇక రీసెంట్ గా మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్​ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్  చేస్తున్నట్లు ఒక పోస్టర్​ ద్వారా టీమ్ ప్రకటించారు. ఈ పోస్టర్​లో తాప్సీ(Taapsee) తోపాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు. డిఫరెంట్ స్టోరీతో.. ఎంటర్టైన్మెంట్ బేస్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషిస్తుండగా మార్క్​ కె. రాబిన్​ ఈ మూవీకి మ్యూజిక్ చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..