The Warrior:రామ్ 'ది వారియర్‌' ఓటిటి రిలీజ్ డిటేల్స్ ..షాకింగే

By Surya Prakash  |  First Published Mar 1, 2022, 6:24 AM IST

'ది వారియర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది.  శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై రామ్ కు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.



ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో  ఆది పినిశెట్టి మరోసారి విలనిజం చూపించనున్నాడు. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించనున్నాడు. జూలై 1, 2022 న తెలుగు,తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయటానికి విడుదల తేదీని ఫిక్స్ చేసారు. అలాగే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటి పార్టనర్ , ఓటిటి రిలీజ్ గురించి ఎగ్రిమెంట్ అయ్యిందని సమాచారం.

రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న   'ది వారియర్‌' ఓటిటి రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొందం చేసుకున్నారు. అలాగే థియోటర్ లో రిలీజైన 50 రోజుల తర్వాత రిలీజ్ ఉండేలా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. మరో ప్రక్క స్టార్ మా వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మంచి రేటుకు పోటీ పడి సొంతం చేసుకున్నారు. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఈ సినిమా ఇస్తారని ఎవరూ ఊహించలేదు.

Latest Videos

 అమేజాన్ ప్రైమ్ కానీ, నెట్ ప్లిక్స్ లో గానీ రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. అయితే మంచి రేటుతో హాట్ స్టార్ వారు ఈ రైట్స్ ని పోటి పడి మరీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటిటి, శాటిలైట్ హిందీ,తెలుగుతో కలిపి సినిమా బడ్జెట్ లో చాలా భాగం రికవరీ అయ్యిపోయినట్లు సమాచారం. దాంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నట్లు వినికిడి. థియోటర్స్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తం బోనస్ అవుతుంది.
 
ఇక ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.  'ది వారియర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది.  శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై రామ్ కు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.  

లింగుస్వామి సినిమాతో తమిళంలో కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని చూస్తున్నాడు రామ్. అందుకే ఆయనకు ఓకే చెప్పాడు. ఈ మధ్య కాలంలో లింగుస్వామికి కూడా సరైన హిట్ లేదు. ఇలాంటి సమయంలో ఈయనతో సినిమా చేస్తున్నాడు. రామ్ కెరీర్‌కు కూడా ది వారియర్ కీలకంగా మారింది.

click me!