Rowdy Boys OTT: “రౌడీబాయ్స్‌”ఓటీటి రిలీజ్ డేట్ ,ప్లాట్‌ఫామ్‌

Surya Prakash   | Asianet News
Published : Mar 01, 2022, 06:17 AM IST
Rowdy Boys OTT: “రౌడీబాయ్స్‌”ఓటీటి రిలీజ్ డేట్ ,ప్లాట్‌ఫామ్‌

సారాంశం

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రంకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. 


దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన ఆశిష్ హీరోగా డెబ్యూ  చిత్రం రౌడీ బాయ్స్ . సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రంకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.  దాంతో చాలా మంది ఓటీటిలో ఈ సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పుడు రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశాం అని దిల్ రాజు తెలిపారు.  ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

 
 ‘రౌడీబాయ్స్‌’ డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 లో మార్చి 11  నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌, కార్తిక్‌ రత్నం, తేజ్ కురపాటి తదితరులు నటించారు. ఎప్పటిలాగే అనుపమ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు ఆశిష్‌. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన బాణీలు ఆకట్టుకున్నాయి.
 
ఈ చిత్రం కథమిటంటే...అక్షయ్ (ఆశిష్) ఎల్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) బిఎంసి మెడికల్ కాలేజ్ లో ఒక మెడికో. వాళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఆ తర్వాత పరిణామాలు ఏంటి? ఇది రెండు కాలేజ్ ల మధ్య యుద్ధానికి ఎలా దారి తీసింది అన్నది ప్రధాన కథ. మ్యూజికల్ గా, విజువల్ గా ఇంప్రెస్ చేయడం ఈ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్. మొత్తంగా రౌడీ బాయ్స్ ఒక సాధారణంగా నిలిచే యూత్ ఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ.
 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: లంగావోణీలో దురంధర్ బ్యూటీ సారా అర్జున్ ఫోటోషూట్ వైరల్
Jobs: యాంక‌ర్ సుమ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఉందా.? మంచి జీతంతో పాటు పేరు, ప్ర‌ఖ్యాత‌లు కూడా