Rajendhar:శింబు తండ్రి టి.రాజేందర్ కి తీవ్ర అస్వస్దత, హాస్పటిల్ లో

Surya Prakash   | Asianet News
Published : May 24, 2022, 01:27 PM IST
Rajendhar:శింబు తండ్రి టి.రాజేందర్ కి తీవ్ర అస్వస్దత, హాస్పటిల్ లో

సారాంశం

 కొద్ది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. 


టి.రాజేందర్ తమిళం వారికి మాత్రమే కాదు..తెలుగు వారికి పరిచయమే. ‘ప్రేమసాగరం’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరో శింబు తండ్రిగా ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. అంతేకాదు.. అప్పట్లో తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తెలుగబ్బాయినే అల్లుడిగా చేసుకున్నారు. ఆయనే టి.రాజేందర్‌. ప్రముఖ దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత అయిన టి.రాజేందర్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. 

దాంతో  ఆయనను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. రాజేందర్‌ను సింగపూర్‌కు తీసుకెళ్లి అత్యాధునిక చికిత్స అందించాలని హీరో, రాజేందర్ తనయుడు శింబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

అప్పట్లో ‘ప్రేమసాగరం’ సినిమా తరువాత రాజేందర్‌ పేరు మారుమోగింది.  1983లో విడుదలైన ‘ప్రేమసాగరం’ తెలుగునాట రికార్డులు సృష్టించింది. విజయవాడలో రెండు సంవత్సరాలు ఆడింది. ఆ సినిమాతోనే  ఆయన పరిచయమయ్యాను. టి. రాజేందర్‌ సాంగ్‌ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజికే, చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికే...’ పాట ఎంతో హిట్టో తెలిసిందే. 

‘చక్కనైన ఓ చిరుగాలి...ఒక్కమాట వినిపోవాలి..’ ఈ పాటను తెలుగు ప్రజలు ఆల్‌టైం హిట్‌ చేశారు.ప్రేమసాగరం నుంచి టి.రాజేందర్‌ సినిమాలు అంటే హిట్‌. ఆయన  సినిమాలో పాటలు బాగుంటాయి. సాహిత్యం బాగుంటుంది. పాట పాడుకునేలా ఉంటుంది. దాసరి నారాయణరావుగారికి ఆయన ఏకలవ్య శిష్యుడని చెప్తూంటారు.‘ప్రేమసాగరం’ సినిమా ఫంక్షన్‌ విజయవాడలో చేసినప్పుడు టి.రాజేందర్‌ గొప్ప డైరెక్టర్‌ అవుతారని ఆయన  అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే