
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)మూవీ సక్సెస్ జర్నీ కొనసాగుతుంది. వర్కింగ్ డేస్ లో ఓ మోస్తరుగా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం వీకెండ్స్ సాలిడ్ కలెక్షన్లు రాబడుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరైన సర్కారు వారి పాట ఓవర్సీస్ లో లాభాల బాట పట్టింది. నార్త్ అమెరికాలో సర్కారు వారి పాట $2.3 మిలియన్స్ రాబట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో కూడా సర్కారు వారి పాట మంచి వసూళ్లు అందుకుంది.
సర్కారు వారి పాట మూవీతో మహేష్ (Mahesh Babu)మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత నెగిటివిటీ మధ్య ఈ చిత్ర రన్ కొనసాగుతుంది. ట్రైలర్ లో పొందుపరిచిన ఒక్క డైలాగ్ కారణంగా రాజకీయాలు ఆపాదించి, కొన్ని మీడియా సంస్థలు సర్కారు వారి పాట చిత్రాన్ని తొక్కేయాలని చూశారన్న వాదన ఉంది. పార్టీల వారీగా విడిపోయిన మీడియా సంస్థలకు సర్కారు వారి పాట టార్గెట్ అయ్యింది. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఈ చిత్ర వసూళ్లను ఆపడం వీలు కాలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ తో పుంజుకొని సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.
ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో గల లోపాలు, ఆర్ధిక నేరగాళ్ల వలన బలవుతున్న సామాన్యులు అనే సామాజిక సమస్య ప్రధానాంశంగా సర్కారు వారి పాట తెరకెక్కింది. ముఖ్యంగా మహేష్ మాస్ లుక్, మేనరిజం కి భారీ రెస్పాన్స్ దక్కింది. కీర్తి సురేష్ తో మహేష్ రొమాంటిక్ ట్రాక్ మరో హైలెట్. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్ కలగలిపి ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.