'సై రా' క్లైమాక్స్ పై సందేహాలు.. ఆలోచనల్లో దర్శకనిర్మాతలు!

By Udayavani DhuliFirst Published Sep 4, 2018, 5:47 PM IST
Highlights

బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తోంది. అదే 'సై రా నరసింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తోంది. అదే 'సై రా నరసింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది.

చరిత్రకు కొంత ఫిక్షన్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే నరసింహారెడ్డిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది. కోట గుమ్మానికి అతడి తలను వేలాడగట్టింది. అక్కడితో సినిమా ఎండ్ అయిపోవాలి. స్క్రిప్ట్ లో కూడా దానికి ప్రకారమే రాసుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం క్లైమాక్స్ ఎపిసోడ్ పై పునరాలోచన చేస్తోంది. నరసింహారెడ్డి చావుతో సినిమా ముగిస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్న మేకర్స్ లో కలుగుతోంది.

యాంటీ క్లైమాక్స్ కాకుండా.. కొనసాగింపుగా కొన్ని పాజిటివ్ సీన్లు రాసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఉయ్యాలవాడ తరువాత పుట్టుకొచ్చిన మరికొంతమంది స్వాతంత్య్ర సమరయోధులని తెరపై చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనల్లో చిత్రబృందం తలమునకలై ఉన్నారు. 

click me!