ఎవరిని అడిగి లిరిక్స్ మార్చారు.. ప్రముఖ గాయని ఫైర్!

Published : Sep 04, 2018, 04:39 PM ISTUpdated : Sep 09, 2018, 12:02 PM IST
ఎవరిని అడిగి లిరిక్స్ మార్చారు.. ప్రముఖ గాయని ఫైర్!

సారాంశం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాకిస్థానీ గాయకుడు ఆతిఫ్ అస్లాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి లిరిక్స్ మార్చి రాశారంటూ చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. 

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాకిస్థానీ గాయకుడు ఆతిఫ్ అస్లాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి లిరిక్స్ మార్చి రాశారంటూ చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే.. 1972లో వచ్చిన 'పాకీజా' అనే సినిమాలో 'చల్తే చల్తే' అనే పాటను లతా పాడారు.

అయితే ఈ పాటను 'మిత్రో' అనే సినిమాలో రీమిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రీమేక్ వెర్షన్ ను ఆతిఫ్ అస్లాం పాడారు. అయితే అలనాటి క్లాసిక్ సాంగ్ ని రీమిక్స్ చేసి పాడుచేసినందుకు లతా మంగేష్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పాటను వినాలని కూడా అనుకోవట్లేదని తెగేసి చెప్పేశారు. 'క్లాసిక్స్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తే నాకు చాలా బాధేస్తుంది.

అలా చేయడం వెనుక వాళ్ల టాలెంట్ ఏముంటుంది. ముందు వెనకా ఆలోచించకుండా ఆ పాటలను రీమిక్స్ చేసేస్తున్నారు. ఈ పాట రీమిక్స్ లో పాడిన లిరిక్స్ ని నేను విన్నాను. ఎవరి అనుమతి తీసుకొని లిరిక్స్ మార్చారు..? ఆ పాత పాటను రాసిన వారు తమ ఆలోచనలకు పదును పెట్టి రాసుకున్నారు. వాటిని మార్చి రీమిక్స్ గా మార్చే హక్కు ఎవరికీ లేదు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?