20 గంట‌ల్లో 'సైరా' డ‌బ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్!

Published : Jun 27, 2019, 01:07 PM IST
20 గంట‌ల్లో 'సైరా' డ‌బ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి డైరెక్టర్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి డైరెక్టర్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు.

చిరు కేవలం ఇరవై గంటల్లో డబ్బింగ్ పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి డబ్బింగ్ చెప్పుకోవడమనేది అంతా ఈజీ కాదు.. కెమెరా ముందు ఎంత కష్టపడాలో.. డబ్బింగ్ థియేటర్ లో కూడా అంతే కష్టం ఉంటుంది. ప్రతీ సీన్, ఎమోషన్ అర్ధం చేసుకొని డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్లాలి.

ఒక్కోసారి వారం, పది రోజులు కూడా డబ్బింగ్ థియేటర్ లోనే గడపాల్సివస్తుంది. అయితే చిరంజీవి మాత్రం 'సై రా' డబ్బింగ్ ని ఇరవై రోజుల్లో పూర్తి చేశారు. చిరంజీవి తన కొత్త  సినిమాను వచ్చే వారమే మొదలుపెట్టాలి. అందుకే 'సై రా' డబ్బింగ్ ని వీలైనంత తొందరగా పూర్తి చేద్దామని ఫిక్స్ అయ్యారు.

కేవలం 20 గంటల్లో డబ్బింగ్ పనిని పూర్తి చేశారు మెగాస్టార్. నిజానికి ఈ సినిమాలో డైలాగ్ పార్ట్ చాలా ఎక్కువ.. కొన్ని సన్నివేశాల్లో పేజీల కొద్దీ డైలాగులు పలకాల్సివచ్చిందట.  అయితే చిరు మాత్రం తనకున్న అనుభవంతో అతి తక్కువ సమయంలో డబ్బింగ్ పూర్తి చేసేసారు. 
 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?