సైరా మూవీ కోసం కోట్ల రూపాయలతో భారీ సెట్స్ వేయిస్తున్న రామ్ చ‌ర‌ణ్

Published : Sep 04, 2017, 08:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
సైరా మూవీ కోసం కోట్ల రూపాయలతో భారీ సెట్స్ వేయిస్తున్న రామ్ చ‌ర‌ణ్

సారాంశం

శరవేగంగా జరుగుతున్న సైరా సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులు  హైద్రాబాద్  పొలాచ్చి రాజస్థాన్ ల‌లో భారీ సెట్స్ నిర్మాణం  చిరు మూవీ కోసం 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న నిర్మాత రామ్ చ‌ర‌ణ్ 

ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి  సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 శతాబ్దాలకు పూర్వం చరిత్రను చెప్పాల్సి ఉండడంతో.సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. అలనాటి కాలానికి చెందిన సెట్స్ ను ఆవిష్కరించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు.

 

అప్పటి కాలానికి చెందిన రిఫరెన్స్ లు ఏమీ లేవు. బ్రిటిష్ పాలన.. తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంది. కేవలం స్కెచ్ ల పైనే 15 మంది పని చేస్తుండగా... పలు పుస్తకాలు,వీడియోలు, చరిత్రకారుల నుంచి రిఫరెన్స్ లు తీసుకుంటున్నాం  అని రాజీవన్ చెప్పారు. హైద్రాబాద్  పొలాచ్చి రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

 

అయితే ఇవి చాలా గ్రాండ్ గా ఉంటాయని.. అంతకు మించి మరే ఇతర వివరాలను చెప్పలేనని అంటున్నారు రాజీవన్.  కానీ సైరా లో నటించే నటీనటులు  టెక్నీషియన్స్ కే కాకుండా కేవలం ఈ సెట్స్ కే చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారట. సో బడ్జెట్ 200 కోట్లకి చేరువలో ఉంటుందన్నమాట. 

 

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు వివిధ వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే చిత్రం ఎలా వుండబోతోందన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేయగా అది ఇప్పుడు 200 కోట్లకు చేరుతోందని అంచనా వేస్తున్నారు.

 

అయినా ఖర్చుకు వెనకాడకుండా కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాను బాహుబలి రేంజ్ లో హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ హీరోగా నటించిన చిరంజీవి అక్కడి ప్రేక్షకులకు కొత్త కాదు. మరోవైపు కేంద్ర మంత్రిగా కూడా దేశమంతా చిరంజీవి సుపరిచితులు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే