మీడియాకు ఏమి చెప్పలేను.. నానా పటేకర్ వివరణ!

By Prashanth MFirst Published Oct 8, 2018, 9:38 PM IST
Highlights

బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నానా పటేకర్ - తను శ్రీ దత్త ల వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట తను శ్రీ తనకు ఒక సీనియర్ యాక్టర్ నుంచి పదేళ్ల క్రితం లైంగిక వేధింపులు మొదలయ్యాయని చెప్పిన సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నానా పటేకర్ - తను శ్రీ దత్త ల వివాదం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట తను శ్రీ తనకు ఒక సీనియర్ యాక్టర్ నుంచి పదేళ్ల క్రితం లైంగిక వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. అయితే ఆమెకు బాలీవుడ్ నుంచి కాస్త మద్దతు లభించడంతో నానా పటేకర్ తనను వేధించాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. 

దీంతో బాలీవుడ్ లో మరికొందరు ఆమెకు మద్దతు పలికినప్పటికీ ఇతరులు కొంత మంది నానా పటేకర్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఫైనల్ గా నానా పటేకర్ ఈ విషయంపై స్పందించారు. మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ముందుగా ఆయన చెప్పారు. అయితే మీడియా వద్దకు వచ్చిన తరువాత తాను ఏమి మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. 

ఎందుకంటే తన లాయర్ గారు ఇప్పుడు ఎలాంటి విషయాన్నీ ఇక్కడ ప్రస్తావించవద్దని చెప్పారని తెలుపుతూ.. పదేళ్ల క్రితం నేనేమీ చెప్పాను, ఇప్పుడు అదే చెబుతున్నానని నానాపటేకర్ అన్నారు. అదే విధంగా సత్యంలో ఎప్పుడు మార్పులు రావని గట్టిగా చెప్పారు. దీంతో బాలీవుడ్ మీడియాలో ఈ వివాదం గురించి వార్తలు మరింత చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే నానా పటేకర్ చట్టప్రకారం కోర్టుకు హాజరై మీడియాకు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!