`స్వాతిముత్యం` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. సడెన్‌ సర్‌ప్రైజ్‌.. అంత త్వరగానా?

Published : Oct 19, 2022, 12:30 PM IST
`స్వాతిముత్యం` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. సడెన్‌ సర్‌ప్రైజ్‌.. అంత త్వరగానా?

సారాంశం

బెల్లంకొండ గణేష్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ `స్వాతిముత్యం`. ఈ సినిమా దసరాకి విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అందుకే డేట్ ఫిక్స్ అయ్యింది.

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం `స్వాతిముత్యం`. దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ క్లాసిక్ మూవీ `స్వాతిముత్యం` పేరుతో వస్తున్న చిత్రం కావడంతో అంతా అటెన్షన్‌ నెలకొంది. ఇందులో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించగా, సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కింది. దసరా కానుకగా ఈ సినిమా విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. రెండు పెద్ద సినిమాలు (గాడ్ ఫాదర్‌, ది ఘోస్ట్)ల మధ్య విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 28న `ఆహా`లో `స్వాతిముత్యం` స్ట్రీమింగ్‌ కానుందని యూనిట్ వెల్లడించింది. అయితే ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక సినిమా విడుదలయ్యాక పది వారాలు(రెండు నెలలు) తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం కేవలం మూడు వారాల గ్యాప్‌లోనే రిలీజ్‌ కాబోతుండటం విశేషం. చిన్న సినిమా కావడం, వెంటనే థియేటర్ల నుంచి వాష్‌ ఔట్‌ కావడంతో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్టు టాక్‌. 

ఈ సినిమా స్మెర్మ్ డొనేషన్‌ నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. స్పెర్మ్‌ డొనేషన్‌ అనే కథని అంతర్లీనంగా చెబుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు లక్ష్మణ్‌ కె కృష్ణ. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అతని జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల నడుమ జీవిత ప్రయాణం ఎలా సాగిందనేది ఈ చిత్ర కథ. అక్టోబర్‌ 5న సినిమాకి మంచి టాక్ వచ్చినా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడం విచారకరం. 

PREV
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!