బిగ్‌ బాస్‌ షో అంటే ఏంటో కూడా తెలియని వాళ్లని హౌజ్‌లోకి తీసుకొచ్చారు.. శ్రీహాన్‌ సంచలన వ్యాఖ్యలు..

Published : Oct 18, 2022, 11:52 PM IST
బిగ్‌ బాస్‌ షో అంటే ఏంటో కూడా తెలియని వాళ్లని హౌజ్‌లోకి తీసుకొచ్చారు.. శ్రీహాన్‌ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

మంగళవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌ లోనూ అదే పరిస్థితి. కెప్టెన్సీ కంటెండెర్ల కోసం బిగ్‌ బాస్‌ సెలబ్రిటీ గేమ్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటి సభ్యులు సినిమాల్లోని పాత్రలను పోషించాల్సి ఉంటుంది.

బిగ్ బాస్‌ 6 తెలుగు షోకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్లు చాలా నిర్లక్ష్యమైన గేమ్‌లు ఆడటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో షో రక్తి కట్టడం లేదు సరికాదా చాలా బోరింగ్ గా మారిపోయింది. చూడ్డానికి చాలా బోరింగ్గా మారిపోయింది. మొదటి రెండు వారాల్లో మరీ దారుణంగా ఉంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుందనుకున్నాం. ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చింది. ఏడో వారంలో నామినేషన్లలోనూ పెద్ద ఆసక్తి లేదు. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మరెవ్వరూ గట్టిగా రియాక్ట్ కాలేదు. 

ఇప్పుడు మంగళవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌ లోనూ అదే పరిస్థితి. కెప్టెన్సీ కంటెండెర్ల కోసం బిగ్‌ బాస్‌ సెలబ్రిటీ గేమ్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటి సభ్యులు సినిమాల్లోని పాత్రలను పోషించాల్సి ఉంటుంది. హీరోలు, హీరోయిన్ల గెటప్‌లతో అలరించాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కో సినిమాలోని పాత్రలను ఇచ్చారు బిగ్‌ బాస్‌. అలా సూర్యకి పుష్ప పాత్రని, గీతూకి శ్రీవల్లి పాత్రని, శ్రీహాన్‌కి చెన్నకేశవరెడ్డి పాత్ర, ఫైమాకి అరుంధతి, మెరీనాకి మిత్రవింద, వాసంతికి బొమ్మరిల్లులోని హాసిని(జెనీలియా) పాత్రని, శ్రీ సత్యకి ఫిదాలోని భానుమతి(సాయిపల్లవి) పాత్రని, రాజ్‌కి చత్రపతిలోని ప్రభాస్‌ పాత్రని, అర్జున్‌కి టెంపర్‌లో దయా(ఎన్టీఆర్‌) పాత్రని, కీర్తికి `ఒసేయ్ రాములమ్మ`లోని విజయశాంతి పాత్రని ఇచ్చారు. 

వీరితోపాటు రోహిత్‌కి `మగధీర`లోని కాళభైరవ(రామ్‌చరణ్‌) పాత్రని, ఇనయకి జగదేక వీరుడు అతిలోక సుందరిలోని ఇంద్రజ(శ్రీదేవి) పాత్రని, ఆదిరెడ్డికి కూలి నెంబర్‌ 1, బాలాదిత్య భీమ్లా నాయక్‌ పాత్రని ఇచ్చారు. వీరిని రెండు టీములుగా విడగొట్టారు. టాలీవుడ్‌ ఫాంటసీ, టాలీవుడ్‌ డైనమైట్‌గా విభజించారు. డైనమైట్‌లో గీతూ, రోహిత్‌, మెరీనా, అర్జున్‌, రాజ్‌, శ్రీసత్య, వాసంతి, సూర్య ఉన్నారు. ఫాంటసీలో రేవంత్‌, కీర్తి, బాలాదిత్య, ఫైమా, శ్రీహాన్‌, ఆదిరెడ్డి ఉన్నారు. ఇనయ సంచాలకులుగా వ్యవహరిస్తుంది. 

సెలబ్రిటీ గేమ్‌లో కంటెస్టెంట్లు కొంత అలరించే ప్రయత్నం చేసినా, వారిలో సీరియస్‌ నెస్‌ కనిపించడం లేదు. వాళ్లే జోకులేసుకుంటూ సరదాగా కాలక్షేపంచేస్తూ వచ్చారు. శ్రీహాన్‌ చెన్నకేశవ రెడ్డిగా, పైమా అరుంధతిగా అలరించే ప్రయత్నం చేశారు. కానీ కాసేపటికే డల్‌ అయ్యారు. నీరసం వచ్చేసింది. హౌజ్‌ మేట్స్ కే నిరసం వచ్చేస్తే, చూసే వారికి మరింత నిరసం వచ్చేస్తుంది. కాసేపటికే వాళ్లంతా తమకు కేటాయించిన పాత్రల నుంచి బయటకు వచ్చి గుసగుసలకు తెరలేపారు. 

దీంతో మండిపోయిన బిగ్‌ బాస్‌ సభ్యులందరికి పెద్ద వార్నింగ్‌ ఇచ్చారు. బిగ్‌ బాస్‌ గేమ్‌లోనూ నిర్లక్ష్యం, నిబంధనల్లోనూ నిర్లక్ష్యం, ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వినోదాన్ని పంచేందుకు పెద్దగా స్పందించలేదని, దీంతో ఆసక్తి లేని వాళ్లు హౌజ్‌ ని వీడి వెళ్లిపోవచ్చని చెప్పారు. మరోవైపు బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశారు. సెలబ్రిటీలు కాస్ట్యూమ్స్ ని విప్పేయాలని తెలిపారు. ఈవారం కెప్టెన్‌ ఎవరూ ఉండరని పేర్కొన్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సభ్యులు బిగ్‌ బాస్‌ ని కాకా పట్టే పనిలో పడ్డారు. ఆయన్ని బతిమాలుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే శ్రీహాన్‌ హాజ్‌ మేట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ సీరియెస్‌ నెస్‌ లేదన్నారు. కనీసం బిగ్ బాస్‌ అంటే ఏంటో కూడా తెలియదని, టైమ్‌కి తినడం పడుకోవడం, ఇలాసోది ముచ్చట్లు వేయడమే వీరి పని అని తెలిపారు. బిగ్‌ బాస్‌ ఏంటో అనేది అందరికి తెలియడం లేదు. ఒక్కసారి చెప్పండి బిగ్‌ బాస్‌ అంటూ వ్యాఖ్యానించాడు. శ్రీహాన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే