మా నాన్ననెందుకు నన్ను అడుగు.. బోల్డ్ సీన్ పై హీరోయిన్ రెస్పాన్స్!

Published : Sep 13, 2018, 03:15 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
మా నాన్ననెందుకు నన్ను అడుగు.. బోల్డ్ సీన్ పై హీరోయిన్ రెస్పాన్స్!

సారాంశం

నటి స్వర భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వర బార్కర్ వైబ్రేటర్ ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంది

నటి స్వర భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వర బార్కర్ వైబ్రేటర్ ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంది. సినిమా విడుదలైన తరువాత ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటిని ఎదుర్కొని స్వర కూడా ధీటుగా సమాధానాలు చెప్పింది.

ఇక ఈ ఇష్యూ సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో మరో నెటిజన్ స్వర భాస్కర్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. స్వర భాస్కర్ తండ్రి రిటైర్డ్ నేవీ ఆఫీసర్. ఇటీవల సుప్రీమ్ కోర్టు సెక్షన్ 377 పై ఇచ్చిన తీర్పుని ప్రశంసిస్తూ ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ కింద కామెంట్ చేస్తూ స్వర నటించిన బోల్డ్ సీన్ ఫోటోని పోస్ట్ చేసి.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..? అంటూ ప్రశ్నించాడు.

తన తండ్రిని అవమానిస్తూ కామెంట్ చేసిన సదరు నెటిజన్ కి స్వర భాస్కర్ కొట్టినట్లు సమాధానమిచ్చింది. 'నేనొక నటిని.. సినిమాలో సీన్ కోసం వైబ్రేటర్ ని ఉపయోగిస్తున్నాను. దీని గురించి మా నాన్నని అడగాల్సిన అవసరం లేదు. నీకేమైనా అనుమానాలు ఉంటే నన్నే నేరుగా అడుగు. ముందు నీ పేరులో నుండి వీర్ అనే పదాన్ని తొలగించు. వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడానికే చాలా దిగజారి ప్రవర్తించావంటూ' అతడిపై మండి పడింది.   

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే