రివ్యూ: యూటర్న్

By Udayavani Dhuli  |  First Published Sep 13, 2018, 2:45 PM IST

ఈ ఏడాది 'రంగస్థలం','మహానటి','అభిమన్యుడు' ఇలా వరుస విజయాలు అందుకొని టాప్ రేసులో దూసుకుపోతోంది సమంత. ఆమె నటించిన తాజా చిత్రం 'యూటర్న్'. కన్నడలో సక్సెస్ అయిన 'యూటర్న్' సినిమాకు ఇది రీమేక్. 


నటీనటులు: సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక తదితరులు 
సంగీతం: పూర్ణ చంద్ర
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి శెట్టి 
ఎడిటింగ్: సురేష్ ఆరుముగం 
నిర్మాతలు: శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు 
దర్శకత్వం: పవన్ కుమార్  

ఈ ఏడాది 'రంగస్థలం','మహానటి','అభిమన్యుడు' ఇలా వరుస విజయాలు అందుకొని టాప్ రేసులో దూసుకుపోతోంది సమంత. ఆమె నటించిన తాజా చిత్రం 'యూటర్న్'. కన్నడలో సక్సెస్ అయిన 'యూటర్న్' సినిమాకు ఇది రీమేక్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

Latest Videos

undefined

కథ: 
రచన(సమంత) జర్నలిస్ట్ గా పని చేస్తుంటుంది. తన వృత్తిలో భాగంగా ఆమె ఓ స్టోరీచేయాలనుకుంటుంది. ఆర్కేపురం ఫ్లై ఓవర్ మీద జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి స్టోరీ రెడీ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి షార్ట్ కట్ కోసం యూటర్న్ తీసుకునే కొందరు వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలని వారి వాహనాల నెంబర్లు, వివరాలు కలెక్ట్ చేస్తుంది. అలా కలెక్ట్ చేసిన లిస్ట్ లో ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పటికే సుందరం చనిపోయి ఉంటాడు.

దీంతో రచన అతడిని హత్య చేసి ఉంటుందని పోలీసులు ఆమెని అనుమానిస్తారు. ఆ విచారణలో ఎస్ఐ నాయక్(ఆది)కి రచన అమాయకురాలిని తెలుస్తుంది. ఇంతలోనే రచన వివరాలు సేకరించినవ్యక్తులు అందరూ చనిపోయి ఉంటారు. అసలు ఆ ఫ్లై ఓవర్ మీద యూటర్న్ తీసుకునేవాళ్లు ఎందుకు చనిపోతున్నారు..? వారి చావులకు కారణాలు ఏంటి.. ? ఈ కేసుకి రచనకి ఉన్న సంబంధం ఏంటి..? ఈ చావులకి కారణాలు ఏంటో తెలుసుకోగలిగారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
కన్నడలో ఆల్రెడీ నిరూపించుకున్న కథే 'యూటర్న్'. ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమారే రీమేక్ వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేశారు. ఆయన ఎన్నుకున్న కథ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లో కొన్ని తప్పులు దొర్లాయి. కథనంలో విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది. సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా ఆసక్తికరంగా నడిపించారు. సస్పెన్స్ తో సాగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నేరేషన్ లో బాగా స్లో అయింది. కొన్ని సన్నివేశాలను కావాలనే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ప్రీక్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఊపందుకుంటుంది.

అయితే కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉండడంతో అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు లేదు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మంచి ప్రయత్నమనే చెప్పాలి. టిపికల్ హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పిన సమంత  సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయింది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. తను వివరాలు సేకరించిన వ్యక్తులు ఎందుకు చనిపోతున్నారో అర్ధం కానీ పరిస్థితుల్లో ఆమె హావభావాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. వరుస చావులకి కారణాలు తెలిసిన తరువాత మిగిలిన వారిని కాపాడడం కోసం ప్రయత్నించే సన్నివేశాల్లో సమంత అద్భుత నటన కనబరిచింది. ఇన్వెస్టిగేషన్ కోణంలో సాగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. భూమిక కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆమె పాత్ర సినిమాకు మరో ప్లస్ పాయింట్. రాహుల్ రవీంద్రన్ ఉన్నంతలో బాగా నటించాడు. సస్పెన్స్, సీరియస్ అని కాకుండా మధ్యలో సమంత, వాళ్ల అమ్మగా నటించిన క్యారెక్టర్ల ద్వారా కామెడీ పండించారు. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్ సినిమాకు అసెట్. కొన్ని విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంగీతం బాగుంది. నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా పవన్ కుమార్ సినిమాను రూపొందించిన తీరు, ఆయన చెప్పాలనుకున్న సందేశం బాగున్నాయి. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ 'యూటర్న్' కచ్చితంగా నచ్చుతుంది. 

రేటింగ్: 3/5   

click me!