ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లింది అని సమాచారం. దాదాపు. 1.5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. అదెలా సాధ్యమైంది.
సుశాంత్ సినిమా అంటే ఎవరూ పట్టించుకోరు..బిజినెస్ కాదు...టేబుల్ లాస్ తో రిలీజ్ అవుతూంటాయి అనేది ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు పరిస్దితులు మారాయి. సుశాంత్ సినిమాకు సైతం టేబుల్ ప్రాఫెట్ వచ్చేసి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే చాలా ఆసక్తికరమైన విషయాలు బయిటకు వచ్చాయి.
చిలసౌతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి సుశాంత్ కు అల్లు అర్జున్ తో చేసిన `అల వైకుంఠపురములో` బ్రేక్ ఇచ్చింది. హీరోగా అంతకాలం చేసినా రాని గుర్తింపు ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించటంతో కలిసొచ్చింది. అదే ఇప్పుడు `ఇచ్చట వాహనములు నిలపరాదు`సినిమాకు కలిసొచ్చింది. ఈ కొత్త సినిమాతో సుశాంత్ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లింది అని సమాచారం. దాదాపు. 1.5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. అదెలా సాధ్యమైంది.
undefined
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఆహా 3 కోట్లకు సొంతం చేసుకోవటమే మొదట కలిసొచ్చిన అంశం. హిందీ శాటిలైట్ హక్కుల ద్వారా 2.75 కోట్లు వచ్చాయి. అలాగే తెలుగు శాటిలైట్ రూపంలో మరో 2.5 కోట్లు వచ్చాయి. అలాగే ఆడియో రైట్స్ 15 లక్షలకు అమ్ముడుపోయాయి. అలా అన్ని లెక్కలూ వేస్తే ..దాదాపు 1.5 కోట్ల లాభం వచ్చింది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావటం కలిసొచ్చింది.
చిత్రం వివరాల్లోకి వెళితే...సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేది దగ్గరవుతుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ..‘‘రెండో దశ కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. మా చిత్రమూ అందరికీ వినోదం పంచుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’అని సినీ వర్గాలు తెలిపాయి.
సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణచైతన్య నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సంభాషణలు: సురేష్-భాస్కర్, కళ: వి.వి.