సుశాంత్ కేసు: విచారణకు సహకరించడం లేదు.. రియా పరారీలో ఉందన్న బీహార్ డీజీపీ

By Siva KodatiFirst Published Aug 5, 2020, 7:37 PM IST
Highlights

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రస్తుతం పరారీలో ఉందని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్  పాండే తెలిపారు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రస్తుతం పరారీలో ఉందని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్  పాండే తెలిపారు.

కేసు దర్యాప్తులో ఏ మాత్రం సహకరించకుండా రియా తప్పించుకుని తిరుతుగున్నారని డీజీపీ తెలిపారు. కాగా సుశాంత్ ఆత్మహత్యకు రియానే కారణమంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:దిశాని పెంట్‌హౌజ్‌కి రమ్మన్నారు.. ఇంతకి సుశాంత్‌కి ఆమె ఏం చెప్పింది?

ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని అయితే అక్కడి పోలీసులు దీనిని అడ్డుకున్న తీరును గుప్తేశ్వర్ పాండే ఖండించారు.

ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ముంబై పోలీసులు బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచారని, వెంటనే ఆయనను విడిపించాల్సిందిగా ఆయన మహారాష్ట్ర పోలీసులను కోరారు. ఇది మంచి పద్దతి కాదని, ఒక ఐపీఎస్ అధికారిని అది కూడా కేసు దర్యాప్తు నిమిత్తం వస్తే ఇలా నిర్బంధంలో ఉంచడం సరికాదన్నారు. 

click me!