సుశాంత్‌ ఆత్మహత్య కేేసు.. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్న యంగ్ హీరో

Published : Aug 28, 2020, 05:16 PM ISTUpdated : Aug 28, 2020, 05:22 PM IST
సుశాంత్‌ ఆత్మహత్య కేేసు.. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్న యంగ్ హీరో

సారాంశం

సుశాంత్ మరణం తరువాత సూరజ్‌ మీద సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ మాజీ మేనేజర్‌ దిశ సలాని మృతికి సూరజ్‌కి సంబంధం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వేదింపులతో తన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టుగా సూరజ్‌ ఇటీవల వెల్లడించాడు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముందు ఈ కేసు బాలీవుడ్ పెద్ద వైపు వెళ్లగా తాజాగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. అదే సమయంలో ఇండస్ట్రీలో వారసత్వం మీద కూడా ప్రధానంగా  చర్చ జరుగుతోంది. సుశాంత్ మరణం తరువాత కంగనా రనౌత్‌ లాంటి వారు ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై స్వరం పెంచారు.

అదే సమయంలో అభిమానులు వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిపై తీవ్ర స్థాయిలో మాటల దాడి మొదలు పెట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్టార్ వారసులను టార్గెట్‌ చేయటంతో వారు ఒక్కొక్కరుగా సోషల్‌ మీడియాకు దూరమవుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా లాంటి వారు తన సోషల్‌ మీడియా పేజ్‌లో కామెంట్స్‌ను డిజేబుల్‌ చేయగా తాజాగా మరో యంగ్ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌లను డిలీట్ చేశాడు.

సినీ కెరీర్‌ మొదలు పెట్టక ముందే వివాదాల్లో చిక్కుకున్న యంగ్ హీరో సూరజ్‌ పంచోలి. సుశాంత్ మరణం తరువాత సూరజ్‌ మీద సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ మాజీ మేనేజర్‌ దిశ సలాని మృతికి సూరజ్‌కి సంబంధం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వేదింపులతో తన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టుగా సూరజ్‌ ఇటీవల వెల్లడించాడు. అయినా వేదింపులు తగ్గకపోవటంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ లు అన్నింటినీ డిలీట్  చేశాడు సూరజ్‌.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు డిలీట్  చేసిన తరువాత `మళ్లీ కలుద్దాం ఇన్‌స్టాగ్రామ్‌.. ఎప్పుడు ప్రపంచం మంచిగా మారుతుందో అప్పుడు మళ్లీ తిరిగి నిన్ను కలుస్తానని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నా` అంటూ ఇన్‌ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..