రిలీజ్ కు ముందే గర్జిస్తున్న సింగం3

Published : Nov 27, 2016, 01:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
రిలీజ్ కు ముందే గర్జిస్తున్న సింగం3

సారాంశం

విడుదల కాకముందే దుమ్మురేపుతున్న సింగం3 100 కోట్లు దాటిన సింగం3 ప్రీ రిలీజ్ బిజినెస్   

సూర్య హీరోగా నటిసస్తున్న సింగం 3 రిలీజ్ కాకుండానే 100 కోట్ల బిజినెస్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. సింగం3 చిత్రాన్ని హరి తెర‌కెక్కించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు.

 

ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ‌నాడులో సింగం 3 మూవీ రైట్స్ కు 42 కోట్లు, క‌ర్నాట‌కతో పాటు మిగిలిన ఏరియాలో రిలీజ్ కానున్న త‌మిళ వెర్షెన్ కోసం 5 కోట్లు బిజినెస్ జ‌రిగింద‌ట‌.

 

ఇక మ‌ల‌యాళం వెర్షెన్ రైట్స్ ను సూర్య ఫ్యాన్స్ అసోసియేష‌న్ 10 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. తెలుగు రైట్స్ ను దాదాపు 25 కోట్లుకు మ‌ల్కిపురం శివ‌కుమార్ సొంతం చేసుకున్నార‌ని తెలిసింది. ఓవ‌ర్ సీస్ రైట్స్ & శాటిలైట్ రైట్స్ క‌లుపుకుంటే దాదాపు 100 కోట్లు పైగానే బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

 

ఇలా రిలీజ్ కు ముందే 100 కోట్లు బిజినెస్ చేస్తే... ఇక రిలీజ్ త‌ర్వాత సింగం3  ఎంత క‌లెక్ట్ చేస్తుందో..? ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి..!

PREV
click me!

Recommended Stories

GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?