Surya Movie Releas: మెగాస్టార్ ను ఢీ కొట్టబోతున్న సూర్య.

Published : Dec 14, 2021, 12:41 PM IST
Surya Movie Releas: మెగాస్టార్ ను ఢీ కొట్టబోతున్న సూర్య.

సారాంశం

మెగాస్టార్  తో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తన అప్ కమింగ్ మూవీ ఈటిని, మెగాస్టార్ ఆచార్య రిలీజ్ డేట్ రోజే రంగంలోకి దింపబోతున్నాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.   

ఈ మధ్య బాగా దూకుడు చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya). ఎక్స్ పెర్మెంట్స్ చేస్తూ.. థైర్యంగా  సినిమాల విషయంలో తాను తీసుకుంటున్న స్టెప్స్ సూపర్ సక్సెస్ అవుతుండటంతో.. జోరు పెంచాడు. ఈసారి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ (Megastar)  తోనే సై అంటే  సై అంటున్నాడు. ఎప్పుడూ ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే Surya.. ఈసారి కూడా ఎక్ప్ పెర్మెంటల్ మూవీ చేస్తున్నాడు.  వైవిధ్యభరితమైన కథతో.. 'ఈటి' అనే టైటిల్ తో విలక్షణ దర్శకుడు పాండిరాజ్(Pandira) డైరెక్ట్ చేస్తున్న సినిమాను పిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్. 


సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ తో కలుపుకుని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తమిళంలో ఎదర్కుమ్ తునిందవన్ గా తెరకెక్కిన ఈమూవీ తెలుగులో ఈటీ పేరుతో రిలీజ్ కాబోతోంది.  అటు అదే రోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగా పవర్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో  నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీ అయ్యింది. 


సూర్య(Surya)కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాని మెగాస్టార్ ను కాదని సూర్య సినిమాను చూసేంత సీన్ మాత్రం టాలీవుడ్ లో లేదు. ఆచార్య వేవ్ గట్టగా ప్రభావం చూపిస్తే.. ఈటి సినిమా కనిపిచే అవకాశం ఉండదు. అసలు థియేటర్లు కూడా ఎక్కువగా దొరుకుతాయో లేదో  తెలియదు. సన్ పిక్చర్స్(Sun Picturs) నిర్మిస్తున్నారు కాబట్టి థియేటర్స్ దొరికి.. ఒక వేళ ఈటీ సినిమా బాగుంది అనే టాక్ వినిపిస్తే.. ఓ సెక్షన్ ఆడియన్స్ మాత్రమే ఈటి వైపు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. సూర్య ఏ ధైర్యంతో ఆరోజు సినిమా రిలీజ్ చేయబోతున్నాడా.. అని ఫిల్మ్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. 

Also Read : Virata Parvam: విరాటపర్వం రిలీజ్ ఇప్పట్లో లేనట్టే... ఎం చెప్పారంటే..?


తమిళనాట విలక్షణ దర్శకుడిగా Pandira కి పేరు ఉంది. గతంలో ఆయన దర్శకత్వంలో సూర్య నటించాడు కూడా. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గ నటిస్తున్ ఈ సినిమాలో, సూరి .. వినయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఈ మధ్య కరోనా టైమ్ నుంచి ఇంకొంచెం దూకుడు పెంచాడు కోలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. నిర్మాగా కూడా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్న సూర్య... కరోనా టైమ్ లో  ఆకాశమే నిహద్దురా, జై భీమ్ లాంటి సినిమాలను ఓటీటీ రిలీజ్ చేసి.. సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. కొన్ని వివాదాలు కూడా ధైర్యంగా ఫేస్ చేశాడు సూర్య. 

Also Read : Mahesh Babu: మహేష్ ఆకస్మిక ప్రయాణం.. ఫ్యాన్స్ లో ఆందోళన!

PREV
click me!

Recommended Stories

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!