Surya Jai Bhim Movie : ఆస్కార్ ఛానల్ లో జైభీమ్.. మొదటి తమిళ సినిమాగా రికార్డ్..

Published : Jan 18, 2022, 03:40 PM ISTUpdated : Jan 18, 2022, 03:42 PM IST
Surya Jai Bhim Movie :  ఆస్కార్ ఛానల్ లో జైభీమ్.. మొదటి తమిళ సినిమాగా రికార్డ్..

సారాంశం

సూర్య జై భీమ్  సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వరకూ వెళ్లి వచ్చిన ఈ సినిమాకు అదే ఆస్కార్ టీమ్ అందరమైన రికార్డ్ ను కట్టబెట్టారు. దాంతో జైభీమ్ టీమ్ తో పాటు తమిళ సినిమా పండగ చేసుకుంటున్నారు.

సూర్య జై భీమ్  సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వరకూ వెళ్లి వచ్చిన ఈ సినిమాకు అదే ఆస్కార్ టీమ్ అందరమైన రికార్డ్ ను కట్టబెట్టారు. దాంతో జైభీమ్ టీమ్ తో పాటు తమిళ సినిమా పండగ చేసుకుంటున్నారు.

మాస్ క్లాస్ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. పక్కా కమర్షయలం సినిమా చేసి సక్సెస్ సాధించగలడు.. పక్కా ఆర్ట్ పిక్చర్ చేసి కూడ సక్సెస్ సాధించగలడు సూర్య. రీసెంట్ గా ఆయన చేసిన సినమా జై భీమ్. ప్రపంచ సినిమా ప్రశంసలు అందుకున్న ఈమూవీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి.. ఎన్నో అరుదైన గౌరవాలు అందుకుంది.

సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న సంబంధాన్ని ప్రతీ ఒకకరికి గుర్తు చేసి సినిమా జై భీమ్. చంద్రు అనే ఓ నిస్వార్ధ లాయర్.. ఓ ఆడబిడ్డ కుటుంబం కోసం పోరాడిన సినిమా ఇది. జ్జానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ ప్రయోగాత్మక సినిమాను స్వయంగా సూర్యనే నిర్మించాడు.. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా  విమర్శకుల నుంచి కూడా  ప్రశంసలు అందుకుంది.

రీలీజ్ తరువాత రికార్డ్స్ మీద రికార్డ్ స్ సాధిస్తూ వస్తున్న జై భీమ్ మూవీ  ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్‌ హిట్‌ 'ది షాషాంక్‌ రిడంప్షన్‌' ను కూడా అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్‌ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్‌ సినిమాకు ఇలాంటి రేటింగ్‌  రాలేదు. అలాగే గోల్డెన్‌ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినే​ట్‌ అయిన జై భీమ్ కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అఫీషయల్ యూట్యూబ్ ఛానల్ లో సీన్ ఎట్ ది అకాడమీ పేరుతో ఈసినిమాలోని ఓ సన్నివేశాన్ని అప్ లోడ్ చేశారు టీమ్.

 

ఈ ఛానలో తమిళ సినిమా వీడియో ఉండటం ఇదే మొదటి సారి కాగా.. జైభీమ్ టీమ్ ఈ విషయం తెలుసుకుని దిల్ ఖుష్ అవుతున్నారు. సంబరాలు చేసుకుంటన్నారు. మూవీ టీమ్ తో పాటు తమిళ పరిశ్రమ కూడా సంతోషంలో ఉంది. చాలా మంది సెలబ్రెటీలు మరో సారి జై భీమ్ ను మెచ్చుకుంటున్నారు  ఈమూవీ టీమ్ ను అభినందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది