సినిమా షూటింగ్ సగం కూడా అవ్వలేదు అప్పుడు రామ్ చరణ్(Ram Charan) సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. స్టార్టింగ్ లోనే కళ్లు చెదిరే బిజినెస్ డీల్ తో .. భారీ అంచనాలు పెంచుతుంది సినిమా.
సినిమా షూటింగ్ సగం కూడా అవ్వలేదు అప్పుడు రామ్ చరణ్(Ram Charan) సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. స్టార్టింగ్ లోనే కళ్లు చెదిరే బిజినెస్ డీల్ తో .. భారీ అంచనాలు పెంచుతుంది సినిమా.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ (RRR) తో పాన్ ఇండియాకు వెళ్తున్న చరణ్...నెక్ట్స్ మొత్తం పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేసుకుంటున్నాడు. దానిలో బాగంగానే నెక్ట్స్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో భారీ సినిమాను స్టార్ట్ చేశాడు చరణ్. ఈ మూవీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. షూటింగ్ దశలో ఉండగానే మంచి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి ఈ సినిమాకు.
రామ్ చరణ్(Ram Charan) హీరోగా... శంకర్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీకి భారీ ప్రిరిలీజ్ బిజినెస్ ఆపర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓ సంస్థ ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా 200 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. కియారా అద్వాని(Kiara Advany )హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో అన్ని భాషలకు చెందిన స్టార్ కాస్ట్ కనిపించబోతున్నారు.
ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. చరణ్ సినిమాలకు భారీ బిజినెస్ అవుతుంది. ట్రిపుల్ ఆర్(RRR) పుణ్యమా అని రామ్ చరణ్ పాన్ ఇండియాలో మారు మోగిపోతున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్అ అవ్వాల్సిన ట్రపుల్ ఆర్(RRR) కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. అయితే శంకర్(Shankar) తో చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అటు భారతీయుడు 2 షూటింగ్ పనుల మీద శంకర్ గ్యాప్ ఇవ్వడం. ట్రిపులు ఆర్ ప్రమోషన్స్ కోసం చరణ్ గ్యాప్ తీసుకోవడంతో.. షూటింగ్ గ్యాప్ వచ్చింది.
అయితే ఈ గ్యాప్ లో రామ్ చరణ్ వెంకీ అట్లూరి(Venky Atluri)తో చేయబోతున్న సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కరోనా ఇబ్బంది పోయిన వెంటనే రామ్ చరణ్ (Ram Charan)– వెంకీ సినిమాస్టార్ట్ అయ్యే సూచనలు కరిపిస్తున్నాయి. ఈలోపు ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినే చరణ్ నెక్ట్స్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తతం ట్రిపుల్ ఆర్, ఆచార్య(Acharya) సినిమాలు కంప్లీట్ చేశాడు రామ్ చరణ్(Ram Charan). ఈరెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ తో స్క్రీన్ శేర్ చేసుకున్న చరణ్.. ఆచార్యలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో కలిసి నటించాడు. ప్రిబ్రవరి నాలుగున రిలీజ్ కావల్సిన ఆచార్య ను ఏప్రిల్ 1కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమ్. వరుసగా సినిమాలు ప్రకటిస్తున్న మెగా పవర్ స్టార్.. మరికొన్ని కథలను హోల్డ్ చేసి పెట్టారు.