Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాలో విజయ్ సేతుపతి.. ఏపాత్ర చేయబోతున్నారంటే.?

Published : Jan 18, 2022, 03:13 PM IST
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాలో  విజయ్ సేతుపతి.. ఏపాత్ర చేయబోతున్నారంటే.?

సారాంశం

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan). ఒకదానివెంట మరొకటి పూర్తి చేసుకుంటూ పోతున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ను కూడా కలుపుకుపోతున్నారు పవర్ స్టార్. ఇప్పుడు ఆయనతో స్క్రన్ శేర్ చేసుకోవడం కోసం విజయ్ సేతుపతి రెడీ అవుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ Pawan Kalyan) వరుస సినమాలతో జోరు మీద ఉన్నాడు. తగ్గేదే లే అంటున్న మెగా హీరో.. అటు పాలిటిక్స్ ను ఇటు సినిమాలను బాలన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన రానాతో కలిసి నటిచింన భీమ్లా నాయక్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఫిబ్రవరి 25 న ఈమూవీ రిలీజ్ కాబోతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇదే డేట్ న రిలీజ్ అయిపోతుంది సినిమా. ఇక ఈ సినిమా తరువాత మరో  రెండు సినిమాలు సెట్స్ ఎక్కించారు పవర్ స్టార్.

భీమ్లా నాయక్ కంప్లీట్ చేసిన పవన్ కల్యాణ్ Pawan Kalyan).. వెంటనే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సెట్స్ ఎక్కడాడు. ఈ సినిమా షూటింగ్ అంతకు ముందే చాలా వరకూ కంప్లీట్ య అయింది. మిగిలిన షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్ కు సినిమాను రంగంలోకి దింపాలని ఆలోచనలో ఉన్నారు టీమ్. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు పవర్ స్టార్.  ఇప్పటికే హరీష్ శంకర్ మూవీ ని కూడ స్టార్ట్ చేశారు.

భవధీయుడు భగన్ సింగ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమా కోసం విలన్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. తను రాసుకున్న విలన్ క్యారెక్టర్ కోసం గట్టిగానే సెర్చ్ చేశారట. ఫైనల్ గా తమిళ స్టార్.. మక్కల్ సెల్వమ్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

  
ఈసినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi  ) అయితే కరెక్ట్ గా సరిపోతాడు అని ఫిక్స్ అయ్యాడట శంకర్ . ప్రస్తుతం ఆయన తో సంప్రదింపులు జరుపుతున్న్టటు తెలుస్తోంది. దాదపు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని తెలుస్తోంది. టాలీవుడ్ లో చాలా ఆఫర్స్  ఆయన్ను వరించాయి. వాటిలో అద్భతంగా ఒదిగిపోయారు విజయ్ సేతుపతి.

 

హీరోగా తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi  ).. ఆతరువాత క్యారెక్టర్ రోల్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. విలన్ గా కూడా చేస్తూ.. మంచి ఇమేజ్ సాధించారు విజయ్.  తమిళ్ లో విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో.. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా దడదడలాడించారు. ఇప్పుడ పవర్ స్టార్ కు పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాల ద్వారా దగ్గరయ్యారు విజయ్ సేతుపతి.

 

డేట్స్ అజస్ట్ అవ్వకపోవడంతో.. పుష్ప సినిమాలో క్యారెక్టర్ ను వదులు కున్నారు. లేకుంటే పుష్ప(Pushpa) లో ఫహద్ ఫాజిల్ క్యారక్టర్ లో ముంద విజయ్ సేతుపతినే తీసుకున్నారు. డేట్స్ కుదరక పోవడంతో ఇంత మంచి ఆఫర్ నుంచి మధ్యలోనే డ్రాప్ అయ్యారు మక్కల్ సెల్వన్. ఇక పవర్ స్టార్ తో భవదీయుడు భగత్ సింగ్ లో ఎలా కనిపిస్తారో చూడాలి.  గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ కలుస్తుండటంతో ఈ సినిమాపై పవర్ ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు