Surya Controversy: హీరో సూర్యకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు... మరో వివాదంలో తమిళ స్టార్ హీరో

Published : Mar 10, 2022, 08:20 PM IST
Surya Controversy: హీరో సూర్యకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు... మరో వివాదంలో తమిళ స్టార్ హీరో

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి తుపాకులతో కూడా పోలీసులను సెక్యూరిటీగా ఇచ్చారు. 

ఈ మధ్య ఎక్కువగా వివాదాలు చుట్టుముడుతున్నాయి తమిళ స్టార్ సీనియర్ హీరో సూర్యను. అది కూడా ఎక్కువగా సినిమా వివాదాలే ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆయన తాజా సినిమా ఈటీతో ఇటువంటి వివాదాన్నే ఫేస్ చేస్తున్నారు. దాంతో సూర్య ఇంటికి తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతకు ఏర్పాటు చేశారు. 

తాజాగా ఆయన నటించిన ఎదుర్కుమ్‌ తునిందవన్‌ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమాను  పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్‌ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాలో అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయని వారు వాదిస్తన్నారు. అంతే కాదు.. ఈసినిమా రిలీజ్ అవ్వకుండా తమిళ నాడు లోని  కడలూరు, విల్లుపురం జిల్లాలలో సినిమా విడుదలపై నిషేధం విధించాలని  కడలూరు కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 

దీంతో  సూర్యపై కాని.. సూర్య ఇంటి దగ్గర కాని నిరసనలు దాడులు జరిగే అవకాశం ఉండవచ్చు అన్న అనుమానంతొ.. చెన్నైలోని సూర్య నివాసం వద్ద తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే గతోంల కూడా సూర్య ఇలాంటి వివాదాలు ఫేస్ చేశారు. సూర్య నటించిన జై భీమ్‌ సినిమా కూడా అప్పట్లో  వివాదాస్పదం కావడంతో  అప్పుడు కూడా అతని ఇంటికి భద్రత కల్పించారు పోలీసులు.

ఇక ప్రస్తుతం సూర్య ఈటీ సినిమా రిలీజ్ అవ్వగా ఆయన కోసం 3 దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అందులో బాలాతో ఎక్స్ పెర్మెంటల్ మూవీ సూర్య చేయబోతున్నట్టు తెలుస్తోంది.  అ సినిమా తరువాత సూర్య తెలుగులో డైరెక్ట్ తెలుగు మూవీ ప్లాన్ చేసుకుంటన్నాడు. తెలుగులో బోయపాటి శ్రీనుతో సూర్య సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌