RRR: హర్ట్ అయిన ప్రభాస్.. రాజమౌళిని ఆడేసుకున్నాడుగా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 07:01 PM IST
RRR: హర్ట్ అయిన ప్రభాస్.. రాజమౌళిని ఆడేసుకున్నాడుగా..

సారాంశం

రాధే శ్యామ్ చిత్ర ప్రచారం కోసం రాజమౌళి స్వయంగా ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, ప్రభాస్ మధ్య ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర చర్చ జరిగింది.   

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటించిన ప్రేమ కథా చిత్రం కావడంతో తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.  రాజమౌళికి, ప్రభాస్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి చిత్రం తెరకెక్కింది. 

ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం స్వయంగా జక్కన్న రంగంలోకి దిగాడు. రాజమౌళి స్వయంగా ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశాడు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, రాజమౌళి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. 

రాజమౌళి ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో ప్రభాస్ సరదాగా కామెంట్స్ చేశాడు. రాజమౌళిని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ఆర్ఆర్ఆర్ లో నన్ను చిన్న గెస్ట్ రోల్ లో అయినా తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించలేదు. అంటే మీకు ఎన్టీఆర్, చరణ్ అంటేనే ఇష్టమా.. నేనంటే ఇష్టం లేదా అని ప్రభాస్ ప్రశ్నించాడు. 

దీనికి రాజమౌళి బదులిస్తూ.. రాధే శ్యామ్ భాషలో మాట్లాడుకుంటే నువ్వు షిప్ లాంటోడివి. నువ్వు అక్కడ సరిపోతావు అనిపిస్తేనే తీసుకురావాలి. అవసరమైనప్పుడు తప్పకుండా అది చేస్తాను అని రాజమౌళి అన్నారు. రాజమౌళి ఏ సినిమా చేస్తుంటే ఆ హీరోల గురించే ఆలోచిస్తారని ప్రభాస్ తెలిపాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇదే నెలలో 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం రాధే శ్యామ్.  రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌