'ముత్యాల ముగ్గు' నటుడు వెంకటేశ్వర రావు కన్నుమూత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 07:41 PM IST
'ముత్యాల ముగ్గు' నటుడు వెంకటేశ్వర రావు కన్నుమూత

సారాంశం

ముత్యాల ముగ్గు చిత్రంలో పూజారి పాత్రలో నటించిన సీనియర్ నటుడు పి. వెంకటేశ్వర రావు మరణించారు.   

ఇటీవల ఎక్కువగా చిత్ర పరిశ్రమకు చేసిన సీనియర్ నటులు, ప్రముఖుల మరణిస్తుండడం విషాదాన్ని కలిగిస్తోంది. నేడు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. 'ముత్యాల ముగ్గు' ఫేమ్ పిసుపాటి వెంకటేశ్వర రావు(90) మృతి చెందారు. 

వెంకటేశ్వర రావు కొంత కాలంగా వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1975లో లెజెండ్రీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాల ముగ్గు చిత్రంలో వెంకటేశ్వర రావు నటించారు. ఈ చిత్రంలో ఆయన పూజారి పాత్రలో నటించి మెప్పించారు. 

గుడిలో నగలు దొంగిలించారనే నింద మోపబడ్డ పూజారిగా వెంకటేశ్వర రావు బాగా నటించారు. ఈ చిత్రంతోనే మరో లెజెండ్రీ నటుడు రావు గోపాల్ రావు ఖ్యాతి టాలీవుడ్ లో మరో స్థాయికి చేరింది. 

ముత్యాల ముగ్గు తో పాటు వెంకటేశ్వర రావు.. కన్నె మనసులు, ఆత్మీయులు, మట్టిలో మాణిక్యం, సుడిగుండాలు లాంటి చిత్రాల్లో కూడా నటించారు. వెంకటేశ్వర రావు సతీమణి లక్ష్మీ. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు సంతానం. 

మొదట రంగస్థల నటుడిగా రాణించిన వెంకటేశ్వర రావు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. రంగస్థలంపై వెంకటేశ్వర రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌