Surya Direct Telugu Movie: సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకు అంతా రెడీ... డైరెక్టర్ ఎవరంటే...?

Published : Mar 04, 2022, 06:53 PM IST
Surya Direct Telugu Movie: సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకు అంతా రెడీ... డైరెక్టర్ ఎవరంటే...?

సారాంశం

ఇప్పటి వరకూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న తమిళ్ స్టార్ హీరో సూర్య. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.   

నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలని తమిళస్టార్ హీరో  సూర్య చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఆయన తమ్ముడు కార్తీ ఇప్పటికే ఊపిరి సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశాడు. అటు తమిళడబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగులో మంచి ఇమేజ్ సాధించాడు.కార్తీ తెలుగలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు  కాని సూర్యకు తెలుగు అంతగా రాదు. అయితే కార్తికంటే కూడా సూర్యకే తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

ఇప్పటికే చాలా మంది తమిళ  హీరోలు తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. దాంతో సూర్య కూడా త్వరగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.సూర్య తెలుగు సినమా కోసం ముందుగా  బోయపాటి సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. పైగా సూర్య కోరుకునేది కూడా మాస్ యాక్షన్ సినిమాలే కావడంతో, ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమనే అంతా అనుకున్నారు. 

కానీ ఈ లోగానే రామ్ తో బోయపాటి ప్రాజెక్టు ఖాయమైంది. రీసెంట్ గా అఖండ సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన బోయపాటి, ఆ తరువాత సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు. అయితే పుష్ప2 ను వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. దాంతో మరో కథతో మరో హీరోతో సెట్స్ పైకి వెళ్లాలని బోయపాటి అనుకున్నాడు. అయితే ఈలోపు రామ్ తో బోయపాటిసినిమా వార్తలు వచ్చాయి. అటువంటి టైమ్ లోనే సూర్య బోయపాటితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్టటు న్యూస్ హల్ చల్ చేసింది. 

రామ్ తో బోయపాటి సినిమా అని ప్రచారం జరగ్గనే  సూర్యతో సినిమా ఉండక పోవచ్చని అంతా అనుకున్నారు. కానీ సూర్యతో తన సినిమా ఉంటుందనీ, అయితే ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేనని ఈటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి చెప్పాడు. పైగా రజనీ తరువాత తెలుగువారితో మనవాడు అనిపించుకున్న హీరో సూర్యనే అని బోయపాటి సూర్యాను పొగడ్తలతో ముంచెత్తాడు. దాంతో బోయపాటి ఇప్పటికే సూర్యకోసం మంచి యాక్షన్ కథను వండుతున్నట్టు తెలుస్తోంది. రామ్ తో బోయపాటి సినిమా తరువాత సూర్య సినిమా స్టార్ట్  అయ్యే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ