
ప్రాజెక్ట్ కే టైటిల్ తో ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ నందు అమితాబ్, ప్రభాస్ పాల్గొన్నారు. ఇక ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ మూవీ అంటున్న నాగ్ అశ్విన్ రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు అవసరమైన సాంకేతికత విషయంలో మద్దతు ఇవ్వాలంటూ నాగ్ అశ్విన్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కోరారు.
ప్రాజెక్ కే (Project K)మూవీలో ఉపయోగించే కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతకు అందని రీతిన ఉంటాయని, తమ వద్ద ఉన్న భారతీయ ఇంజనీర్స్ బృందం ప్రాజెక్ట్ కే సినిమాకు సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా వెంటనే రిప్లై ఇచ్చారు. మీకు సహాయం చేసే అవకాశం మేము ఎందుకు వదులుకుంటాము.మహీంద్రా గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలు గారు మీకు సహాయం చేస్తారు. ఆ బాధ్యత ఆయన మీద సందేహం లేకుండా వదిలేయండి. ఆయన XUV 700 అభివృద్ధి చేసిన గొప్ప ఇంజినీర్, అలాగే భవిష్యత్ లో గొప్ప ఆవిష్కరణలు చేయడానికి ఆయన అడుగుపడింది.. అంటూ రిప్లై ఇచ్చారు.
ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) గంటల వ్యవధిలో ప్రాజెక్ట్ కే టీమ్ కి సహాయం చేయడానికి ముందు రావడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్ధనకు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేయడం సంతోషం. దయచేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో మిమ్ముల్ని ఎలా కావాలో చెప్పండి.. అంటూ ప్రాజెక్ట్ కే టీమ్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ పట్ల స్పందించారు.
ఆనంద్ మహీంద్రా, ప్రాజెక్ట్ కె టీం మధ్య జరిగిన ఈ సంభాషణ వైరల్ గా మారింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేర్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఊహకు మించి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ నుండి ప్రాజెక్ట్ కె మరో ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని అర్థమవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రాజెక్ట్ కే నిర్మిస్తున్నారు.