ప్రేమించిన అమ్మాయిని తన వశం చేసుకున్న నటుడు కృష్ణశెట్టి..వెంటనే హనీమూన్‌

Published : Feb 26, 2021, 12:09 PM IST
ప్రేమించిన అమ్మాయిని తన వశం చేసుకున్న నటుడు కృష్ణశెట్టి..వెంటనే హనీమూన్‌

సారాంశం

సినీ సెలబ్రిటీస్‌ వరుసగా మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో రానా, కాజల్‌, నితిన్‌, నిఖిల్‌, నిహారిక, మహేష్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు మ్యారేజ్‌లు చేసుకున్నారు. అందులో భాగంగా తాజాగా హిందీ టీవీ నటుడు కృష్ణశెట్టి కూడా ఓ ఇంటి వాడయ్యాడు.

సినీ సెలబ్రిటీస్‌ వరుసగా మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో రానా, కాజల్‌, నితిన్‌, నిఖిల్‌, నిహారిక, మహేష్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు మ్యారేజ్‌లు చేసుకున్నారు. అందులో భాగంగా తాజాగా హిందీ టీవీ నటుడు కృష్ణశెట్టి కూడా ఓ ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు, డెంటిస్ట్ అయిన ప్రగ్యాని ఆయన మంగుళూరులో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహమాడాడు. ఈ వేడుకలో కరణ్‌ కుంద్రా, పౌలొమి దాస్‌ వంటి వారు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే కృష్ణ శెట్టి మ్యారేజ్‌ అయిన వెంటనే హనీమూన్‌ చెక్కేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భార్యతో కలిసి కూర్గ్ కి హనీమూన్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా కృష్ణ శెట్టి స్పందిస్తూ, `నాకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చేతులకు, కాళ్లకి మెహందీ, కాలికి వేళ్లకి రింగు చూశాక అవును, నేను నిజంగానే మ్యారేజ్‌ చేసుకున్నా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఇది కలలగానే ఉంది. ఇదంతా ఈజీగా ఏం జరగలేదు. నా సోదరి ద్వారా ప్రగ్యాని కలిశాను. చూడగానే ఒకరినొకం నచ్చేశాం. 

ప్రగ్యా తల్లిదండ్రులు మాత్రం నాతో పెళ్లంటే సందిగ్దం వ్యక్తం చేశారు. ఎందుకంటే నటుడిగా జీవితం ఎప్పుడెలా ఉంటుందోనని భయపడ్డారు. ఆమెను ఓ ఇంటనీర్‌కి గానీ, డాక్టర్‌కి గానీ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ మేమందరం ఓసారి సమావేశమైనప్పుడు మా మధ్య ఉన్న ప్రేమని చూసి వారు కూడా ఒప్పుకున్నారు. అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం` అని కృష్ణ శెట్టి తెలిపారు. కృష్ణ శెట్టి `దిల్‌ హై తో హై`, `టైమ్‌ మేషిన్‌`, `రుద్ర కే రక్షక్‌` వంటి టీవీ సీరియల్స్ లో నటించాడు.

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?