నా పెళ్లి విధిపై ఆధారపడి ఉందిః విశాల్‌

Published : Feb 26, 2021, 09:56 AM IST
నా పెళ్లి విధిపై ఆధారపడి ఉందిః విశాల్‌

సారాంశం

విశాల్‌ నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల `చక్ర` సినిమాతో ఆయన ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇది ఆశించిన రిజల్ట్ ని పొందలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన పెళ్ళిపై స్పందించారు. విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పాడు. 

విశాల్‌ కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల `చక్ర` సినిమాతో ఆయన ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇది ఆశించిన రిజల్ట్ ని పొందలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన పెళ్ళిపై స్పందించారు. విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పాడు. 

ఓ ఆంగ్ల మీడియాతో విశాల్‌ మాట్లాడుతూ, `ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేను. అంతేకాకుండా తాను విధిని నమ్ముతా. కాబట్టి దేవుడు ఎలాంటి రాతని రాస్తే జీవితం అలా కొనసాగుతుంది. ఇప్పటివరకూ అలాగే జరిగింది.  త్వరలోనే ఓ శుభవార్త చెప్పాలని రాసిపెట్టి ఉంటే, తప్పకుండా అందరికీ వెల్లడిస్తాను` అని తెలిపారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం విశాల్‌ అనీషా రెడ్డితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను డిలీట్‌ చేశారు. దీంతో అనీషాతో ఎంగేజ్‌మెంట్‌ కాన్సిల్‌ అయ్యిందని చెప్పకనే చెప్పారు. 

ఆ తర్వాత మ్యారేజ్‌పై స్పందించలేదు విశాల్‌. మరోవైపు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌తోనూ లవ్‌ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీన్ని వీరిద్దరు ఖండించిన విషయం తెలిసిందే. ఇక విశాల్‌ నటించిన `చక్ర` చిత్రం ఈ నెల 19న విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం విశాల్‌ `తుప్పరివాలం 2` చిత్రంలో నటించబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
తల్లి కాబోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్