వివాదాల్లో `జై భీమ్‌`.. సూర్యని కొడితే లక్ష రూపాయల ఆఫర్‌.. దుమారం..

By Aithagoni Raju  |  First Published Nov 15, 2021, 7:39 PM IST

 `జై భీమ్‌` సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు పీఎంకే నేతలు.


సూర్య(Suriya) నటించిన `జై భీమ్‌`(Jai Bhim) సినిమా ఇటీవల విడుదలై ప్రశంసలందుకుంటోంది. భాషలకు అతీతంగా ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు రేటింగ్‌లోనూ టాప్‌లో నిలిచింది. పాపులర్‌ హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను వెనక్కి నెట్టి టాప్‌ వన్‌లో నిలిచింది. తాజాగా ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కుంది. Jai Bhim సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు పీఎంకే నేతలు. `జై భీమ్‌` సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణలు చేస్తున్నారు.

తమని కించపరిచారని ఆరోపిస్తూ 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కూడా జై భీమ్ హీరో, నిర్మాత అయిన సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది. ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంత్రి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖ కూడా రాశారని తెలుస్తుంది. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ, తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని, అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు. అయినా వివాదం తగ్గలేదు. పీఎంకే నేతలు మరో అడుగు ముందుకేశారు. 

Tap to resize

Latest Videos

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదంలో నటుడు సూర్యకి మద్దుతుగా సీపీఎం లాంటి కొన్ని పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు నిలుస్తున్నాయి. ఈ విషయం మీద సూర్య కూడా వామపక్షాలకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే సినిమాలోని బాధితురాలు సినతల్లి అయిన రియల్ లైఫ్‌ సినతల్లి పార్వతి అమ్మాన్ కు పది లక్షలు విరాళంగా సూర్య ఇవ్వడం విశేషం. సూర్య లాయర్‌గా, లిజో మోల్ జోస్ సినతల్లిగా, మణికందన్ ప్రధాన పాత్రలలో నటించిన `జై భీమ్‌` చిత్రం ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. 

ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమా బాగుందని చెబుతూ ప్రశంసిస్తున్నారు.  తాజాగా ఇది హాలీవుడ్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఐఎండీబీ మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ `ది షాషాంక్ రిడంప్షన్` ను వెనక్కు నెట్టింది. ఈ సినిమా 9.6 రేటింగ్‌ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఫ్రాంక్ డారాబోంట్ `ది షాశాంక్ రిడెంప్షన్` 9.3 రేటింగ్‌తో రెండవ స్థానంలో ఉండగా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల క్లాసిక్ `ది గాడ్ ఫాదర్` 9.2 రేటింగ్‌తో మూడవ స్థానంలో నిలిచింది. జర్నలిస్ట్ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మించిన విషయం తెలిసిందే. 

also read: Shivani Rajashekar: డిప్రెషన్‌ గురించి ఓపెన్‌ అయిన రాజశేఖర్‌ తనయ.. బ్యాడ్‌ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

click me!