రామ్‌ ఫ్యాన్స్ కి రోలెక్స్ సర్‌ప్రైజ్.. దుమ్ములేపుతున్న `విజిల్‌` సాంగ్‌..

Published : Jun 22, 2022, 08:44 PM IST
రామ్‌ ఫ్యాన్స్ కి రోలెక్స్ సర్‌ప్రైజ్.. దుమ్ములేపుతున్న `విజిల్‌` సాంగ్‌..

సారాంశం

రామ్‌ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన `ది వారియర్‌` సినిమాలోని మరో పాట విడుదలైంది. `విజిల్‌` సాంగ్‌ని సూర్య విడుదల చేశారు. 

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని(Ram Pothineni) ఫ్యాన్స్ కి `రోలెక్స్` సూర్య(Suriya)సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న `ది వారియర్‌`(The Warriorr) లోని పాటని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం హీరో సూర్య `ది వారియర్‌` చిత్రంలోని `విజిల్‌`(Whistle Song) పేరుతో సాగే పాటని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతంఈ పాట యూట్యూబ్‌లో దుమ్ములేపుతుంది.

రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన `ది వారియర్‌` చిత్రంలో `విజిల్‌` సాంగ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండింగ్‌ అవుతుంది. ఈ పాటని తెలుగు, తమిళంలో విడుదల చేశారు. ఈ పాటని ఆంటోనీ దాసన్‌, శ్రినిష జయసీలన్‌ ఆలపించారు. సాహితి రాయగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. మాస్‌ బీట్‌గా సాగే ఈ పాట యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌అవుతూ దుమ్మురేపుతుంది. పాట పేరులాగే థియేటర్లలో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉందీ పాట. 

క్లైమాక్స్ కి ముందు ఈ పాట రాబోతుందని అర్థమవుతుంది. ఇందులో రామ్‌ ఎనర్జిటిక్‌ డాన్సుతో ఉర్రూతలూగించారు. ఆయనకు కృతి శెట్టి జోడీ కట్టడంతో ఈ పాట మరింత కలర్‌, గ్లామర్‌ తోడయ్యింది. వెండితెరపై ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండబోతుందని చెప్పొచ్చు. రామ్‌ ఎనర్జీకి పర్‌ఫెక్ట్ మ్యాజింగ్‌ అయ్యే పాట ఇది కావడం విశేషం. ఇక లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న `ది వారియర్‌` చిత్రంలో రామ్‌కి జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఆది పినిశెట్టి విలన్‌ పాత్రని పోషిస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట, టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో రామ్‌ చెప్పే డైలాగ్‌లు, పోలీస్‌గా ఆయన లుక్‌ అదరగొట్టేలా ఉంది. మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌తో రామ్‌ రాబోతున్నారు. ఈ సారి హిట్‌ పక్కా అనే సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం జులై 14న తెలుగుతోపాటు తమిళంలో విడుదల కాబోతుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన చిత్రమిది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ