రవితేజ డ్యూటీలో జాయిన్‌ అయ్యేది అప్పుడే.. `రామారావు ఆన్‌ డ్యూటీ` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

Published : Jun 22, 2022, 06:33 PM IST
రవితేజ డ్యూటీలో జాయిన్‌ అయ్యేది అప్పుడే.. `రామారావు ఆన్‌ డ్యూటీ` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

సారాంశం

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `రామారావు ఆన్ డ్యూటీ`. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది. 

మాస్‌ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న మరో సినిమా `రామారావు ఆన్‌ డ్యూటీ`. ఆయన ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్న చిత్రమిది. శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కి రెడీ అయ్యింది. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. జులై 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్‌. 

ఇందులో రవితేజకి జోడీగా దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. మరోవైపు ఈ చిత్రంతో సీనియర్‌ నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్నారు. పోలీస్‌గా అనేక సినిమాలు చేసిన విజయాలు అందుకున్న రవితేజ ఇప్పుడు ఓ ప్రభుత్వ అధికారికగా కనిపించడం విశేషం. 

ఇదిలా ఉంటే వరుస ఫ్లాప్‌ల అనంతరం `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు రవితేజ. పోలీస్‌గా నటించిన ఈ కమర్షియల్ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో మళ్లీ పుంజుకున్నారు మాస్‌రాజా. ఆ తర్వాత వచ్చిన `ఖిలాడీ` నిరాశ పరిచింది. డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో మళ్లీ కెరీర్‌ మొదటికొచ్చిందా? అనేట్టుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశలన్నీ `రామారావు ఆన్‌ డ్యూటీ`పైనే పెట్టుకున్నారు. 

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సినిమాలపై అంచనాలు పెంచాయి. సినిమా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. దీంతోపాటు రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. `రావణాసురుడు`, `ధమాకా`, `టైగర్‌ నాగేశ్వరరావు` బయోపిక్‌ చిత్రాలు చేస్తున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ