బ్లాక్‌ బస్టర్‌ కాంబో రిపీట్‌.. సుధాకొంగరతో సూర్య నెక్ట్స్ సినిమా..

Published : Jun 12, 2023, 07:47 PM IST
బ్లాక్‌ బస్టర్‌ కాంబో రిపీట్‌.. సుధాకొంగరతో సూర్య నెక్ట్స్ సినిమా..

సారాంశం

బ్లాక్‌ బస్టర్‌ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతుంది. సూర్య, సుధాకొంగర కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. సుధా కొంగర, సూర్య నెక్ట్స్ మూవీ గా వీరిద్దరి కాంబో తెరకెక్కబోతుంది. 

సూర్య వరుస విజయాల మీదున్నాడు. ఆయనకు `ఆకాశమే నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాలు బంపర్‌ హిట్‌ని అందించాయి. ఆ రెండింటిని మించి గెస్ట్ గా చేసిన `విక్రమ్‌` సూర్య రేంజ్‌ని మార్చేసింది. ఇక వరుస పరాజయాల మీదున్న సూర్యని `ఆకాశమే నీ హద్దురా` సినిమా ఊపిరిపోసింది. సూర్యలోని కసిని బయటకు తీసింది. ఏకంగా జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింది. దీనికి కారకులు దర్శకురాలు సుధా కొంగర. 2020లో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా సంచలన విజయం సాధించింది. 

ఈ బ్లాక్‌ బస్టర్‌ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతుంది. సూర్య, సుధాకొంగర కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. సుధా కొంగర, సూర్య నెక్ట్స్ మూవీ గా వీరిద్దరి కాంబో తెరకెక్కబోతుంది. జులైలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. దీనికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందించనున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదుగా,ఈ కాంబో పక్కా అంటోంది తమిళ మీడియా. అంతేకాదు ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించబోతున్నారట. వీరి కాంబోలో వచ్చిన `ఆకాశమే నీ హద్దురా` ఒక మాస్టర్‌ పీస్‌లా నిలిచింది. ఇప్పుడు మరో మాస్టర్‌ పీస్‌ కోసం రెడీ అవుతున్నారు. 

ఇక సూర్య ప్రస్తుతం భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా `కంగువా`లో నటిస్తున్నారు.  ఇది చిత్రీకరణ దశలో ఉంది. అనంతరం సుధాకొంగర సినిమా తెరకెక్కబోతుందట. దీంతోపాటు సూర్య `వాడి వాసల్‌` అనే సినిమా చేయనున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు తెలుగు దర్శకుడు చందూ మొండేటితోనూ ఓ భారీ సినిమా చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

సూర్యకి అంతకు ముందు `ఎస్‌3` తర్వాత హిట్లు లేవు. అదే ఆయనకు చివరి విజయం. ఆ తర్వాత వచ్చిన `తానా సెంద్రా కూటమ్‌` (గ్యాంగ్‌) సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత `ఎన్జీకే`, `కప్పాన్‌` ఇలా వరుసగా మూడు పరాజయాలు చవిచూశారు. ఈ క్రమంలో `సూరారై పోట్రు`(ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటించారు. ఇది అతి తక్కువ ధరకి, సామాన్యుడికి విమాన ప్రయాణం చేయాలని తపించి ఆ కలని నిజం చేసిన డెక్కన్‌ ఎయిర్‌లైన్‌ ఫౌండర్‌ జీ ఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందింది. కరోనా నేపథ్యంలో ఈసినిమా ఓటీటీలో విడుదలైంది. మొదట మామూలు టాక్‌ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. ఓటీటీలో అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్