
యంగ్ హీరో అడివి శేష్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ 2 విజయం సాధించింది. దర్శకుడు శైలేష్ కొలను హిట్ వెర్స్ లో భాగంగా హిట్ 2 తెరకెక్కించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించింది. క్షణం మూవీతో హీరోగా నిలదొక్కుకున్న అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఆయన నటించిన గూఢచారి, ఎవరు?, మేజర్, హిట్ 2 మంచి విజయాలు నమోదు చేశాయి. ప్రస్తుతం గూఢచారి 2లో అడివి శేష్ నటిస్తున్నారు. ఇది స్పై థ్రిల్లర్.
యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్స్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారట. గూఢచారి 2 అనంతరం తాను లవ్ స్టోరీ చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న కొద్ది నెలల్లో దీనిపై ప్రకటన చేస్తానని వెల్లడించారు. కాబట్టి అడివి శేష్ ఫ్యాన్స్ ఆయనలో ఓ రొమాంటిక్ ఫెలోని రానున్న కాలంలో చూడనున్నారు. అడివి శేష్ హీరోగా ఎదిగిన తీరు అద్భుతం. మొదట్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేసి హీరో అయ్యారు. మేజర్ రూపంలో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ చిత్ర నిర్మాత మహేష్ బాబు కావడం విశేషం.
మరోవైపు అడివి శేష్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డను వివాహం చేసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ పార్టీలు, ఫంక్షన్స్ లో అడివి శేష్ దర్శనమిస్తున్నాడు. ఇటీవల జరిగిన రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి అడివి శేష్, సుప్రియ జంటగా హాజరయ్యారు. కాగా ఈ రూమర్స్ పై అడివి శేష్, సుప్రియ మౌనం వహిస్తున్నారు.