మాస్ రాజా రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్ర టైటిల్ ను తాజాగా విడుదల చేశారు. అలాగే ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) చివరిగా ‘రావణసుర’తో అలరించారు. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao) చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తన నెక్ట్స్ సినిమాపైనా అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ప్రేక్షకులను ఖుషీ చేశారు. ఎప్పటి నుంచో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై అఫీషియల్ అప్టేట్ అందింది. మరోవైపు టైటిట్ నూ అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ నూ విడుదల చేశారు.
కార్తీక్ ఘట్టమనేని - రవితేజ కాంబోలో వస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ‘ఈగల్’ (Eagle) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సూపర్ గా డిజైన్ చేశారు. మాస్ మహారాజా రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో రూపొందించిన ధమాకాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లోని ప్రాజెక్ట్ కోసం ఈ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి పనిచేశారు.
undefined
టైటిల్ గ్లింప్స్ విషయానికొస్తే.. రవితేజను మోస్ట్ వాంటెడ్ పెయింటర్ గా పరిచయం చేశారు. అలాగే అతన్ని పత్తి రైతుగా, ఇతర అవతారాలు కూడా ఉన్నాయని చూపించారు. కొందరిని వేటాడే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రవితేజను పట్టుకునేందుకు పెద్ద టీమ్ తో కూడిన రా ఏజెన్సీ పనిచేస్తుంది. ఇంతకీ రవితేజ ఏం చేశారు? పెయింటర్ మోస్ట్ వాంటెండెగా ఎలా మారారు? ఇంతకీ కథ ఏంటనే? అంశాలు ఆసక్తిని పెంచుతున్నారు.
ఇక మ్యూజిక్, టేకింగ్, సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా రవితేజ కొత్త లుక్ లో అలరించబోతున్నారని అర్థం అవుతోంది. డైలాగ్స్ మెటీవేటెడ్ గా ఉన్నాయి. చిత్రంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల ప్రముఖ పాత్రల్లో కనిపించారు. కావ్యా థాపర్ మరో కథానాయికగా నటించింది.
కార్తీక్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతోపాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం, టాప్ టెక్నీషియన్ల బృందం అన్ని క్రాఫ్ట్‌లను చూసుకుంటుంది. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దావ్‌జాంద్ సంగీత దర్శకుడు, శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 2024లో సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని! 🔥🦅
Mass Maharaja 's MASSive ERUPTION - Title Announcement Video OUT 🔥https://t.co/C7u7oOOMxy
Sankranthi Release, 2024 🥁
… pic.twitter.com/2y4WT9UdqT