సూర్య 'కంగువ' ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్

By tirumala AN  |  First Published Aug 12, 2024, 2:08 PM IST

సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. తమిళనాట అయితే ఈ చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు.


సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. తమిళనాట అయితే ఈ చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు. అయితే దాదాపు రిలీజ్ కి రెండు నెలల ముందే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. 

ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. దిశా పటాని హీరోయిన్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించక మానదు. ప్రతి షాట్ ని టెర్రిఫిక్ గా చిత్రీకరించారు. కళ్ళు చెదిరే విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ చూస్తుంటే తన జాతి, ప్రజల కోసం పోరాడే వీరుడిగా సూర్య కనిపిస్తున్నారు. బాబీ డియోల్ అత్యంత క్రూరమైన విలన్ గా నటిస్తున్నారు. 

Latest Videos

 

సూర్య చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కొన్ని షాట్స్ అయితే థ్రిల్ చేస్తున్నాయి. సూర్య రగ్గడ్ లుక్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ ని కూడా చూపించారు. సూర్య ప్రతి సన్నివేశంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇస్తున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టెర్రిఫిక్ గా ఉంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది అని చెప్పడంలో సందేహం లేదు. 

click me!