Bigg Boss Telugu 8: లేటెస్ట్ ప్రోమో అదిరింది... సీజన్ 8ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున!

By Sambi Reddy  |  First Published Aug 12, 2024, 6:54 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మరో ప్రోమో విడుదల చేశారు. లేటెస్ట్ సీజన్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున. 
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పై భారీ అంచనాలున్నాయి. గత సీజన్ సక్సెస్ నేపథ్యంలో రానున్న సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అనుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోలు సరికొత్తగా డిజైన్ చేశారు. స్టార్ మా నుండి సీజన్ 8 లోగో లాంచ్ ప్రోమోతో పాటు నాగార్జున, సత్య నటించిన సెకండ్ ప్రోమో ఇప్పటికే విడుదలయ్యాయి. మూడో ప్రోమో సైతం రిలీజ్ చేశారు. దొంగ అయిన సత్యకు అద్భుత దీపం జీనీ ఏం కావాలన్నా అన్ లిమిటెడ్ గా ఇస్తా కోరుకో అంటాడు.

నాకు అన్నీ అన్ లిమిటెడ్ గా కావాలని సత్య కోరుకుంటాడు. వెంటనే రాజభోగాలు ప్రసాదిస్తాడు నాగార్జున. అయితే రాజభోగాలతో విసిగిపోయిన సత్య... చిరాకు పడుతూ నాకు ప్రైవసీ కావాలని నాగార్జునను అడుగుతాడు. వెంటనే సత్య చిరిగిన బట్టల్లో ఎడారిలో ఒంటరిగా ప్రత్యక్షం అవుతాడు.మూడో ప్రోమో ఇలా డిజైన్ చేశారు. 

Latest Videos

కాబట్టి హౌస్లో కంటెస్టెంట్స్ ఏదైనా కోరుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. హౌస్లో రాజభోగాలు ఉంటాయి. అలాగే కష్టపెట్టే పరమ దరిద్రాలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ప్రోమో చివర్లో నాగార్జున ''ఈ సీజన్లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి'' అని అన్నారు. ప్రోమో చాలా రిచ్ గా ఉంది. ఓ సాంగ్ కూడా కంపోజ్ చేయడం విశేషం. 

అన్ లిమిటెడ్ అనే పదాన్ని గట్టిగా ప్రోమోట్ చేస్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రధానంగా ఈ అన్ లిమిటెడ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా సాగే అవకాశం ఉంది. ఇక మూడో ప్రోమోలో సైతం డేట్ ప్రకటించలేదు. త్వరలో అని మాత్రమే చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 8న లాంచింగ్ డేట్ ఉండే అవకాశం కలదు. సెప్టెంబర్ 1న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ముగియనున్న నేపథ్యంలో నెక్స్ట్ సండే లాంచ్ చేస్తారట. 

కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు పేర్లు తెరపైకి వచ్చాయి. రీతూ చౌదరి. అంజలి పవన్, తేజస్వి గౌడ, బంచిక్ బబ్లు కన్ఫర్మ్ అయ్యారట. బర్రెలక్క, కుమారీ ఆంటీ, మై విలేజ్ షో అనిల్ గిలా, ఖయ్యూం అలీ, అమృత ప్రణయ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, పొట్టి నరేష్ తో పాటు పలువురు సెలెబ్స్ సీజన్ 8లో పాల్గొంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా లాంచింగ్ ఎపిసోడ్ రోజు మాత్రమే కంటెస్టెంట్స్ ఎవరనేది ఒక్కొక్కరిగా రివీల్ అవుతారు. 

click me!