Latest Videos

ఇది జస్ట్ ఆరంభం మాత్రమే.. `కంగువ` అప్‌ డేట్‌ ఇచ్చిన సూర్య..

By Aithagoni RajuFirst Published Jan 11, 2024, 12:14 AM IST
Highlights

హీరో సూర్య తాను ప్రయోగాత్మకంగా చేస్తున్న సినిమా `కంగువ`కి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చారు. సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశాడు 

వరుస హిట్లతో ఉన్న సూర్య.. ప్రస్తుతం భారీ పీరియాడికల్‌ ఫిల్మ్ `కంగువ`లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. దర్శకుడు శివ, అతని టీమ్‌ ఈ మూవీని రూపొందిస్తుంది. జ్ఞానవేల్‌ రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరకు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా సినిమాకి సంబంధించిన అప్‌ డేట్ ఇచ్చాడు హీరో సూర్య. 

`కంగువ`కి సంబంధించిన తన షూటింగ్‌ పార్ట్ పూర్తయ్యిందట. సోషల్‌ మీడియా ద్వారా సూర్య ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే అని, అసలైనది మున్ముందు ఉందన్నారు. అద్బుతమైన షూటింగ్‌ ఎక్స్ పీరియెన్స్ అన్నారు. `కంగువ నా చివరి షాట్‌ పూర్తయ్యింది. మొత్తం షూటింగ్‌ పాజిటివిటీతో నిండిపోయింది. ఇది ఒక దాని ముగింపు, అనేక వాటికి ప్రారంభం, దర్శకుడు శివ టీమ్‌కి ధన్యవాదాలు. ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. కంగువ చాలా పెద్ద స్కేల్‌లో ఉంటుందని, సినిమాని థియేటర్లలో చూసేందుకు ఆతృతగా ఉండలేరు` అని తెలిపారు సూర్య, కంగువ టీమ్‌ని మిస్‌ అవుతున్నట్టు తెలిపారు. 

భారీ స్కేల్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు. సూర్య పాత్ర షూటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా మిగిలిన పోర్షన్‌ షూట్‌ చేయాల్సి ఉందట. అయితే ఈ మూవీకి వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. దానికి చాలా టైమ్‌ పడుతుంది. మిగిలిన షూటింగ్‌ చేసే పనిలో బిజీ అయ్యారు. అయితే ఈ మూవీని మొదట ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కి ప్లాన్‌ చేస్తున్నారట. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తుంది. 
 

click me!